Begin typing your search above and press return to search.

బిడ్డొచ్చే వేళ గోల్డెన్ గ్లోబ్.. ఉపాస‌నలో అంతులేని ఆనందం..

By:  Tupaki Desk   |   16 Jan 2023 5:30 AM GMT
బిడ్డొచ్చే వేళ గోల్డెన్ గ్లోబ్.. ఉపాస‌నలో అంతులేని ఆనందం..
X
ఈసారి మకర సంక్రాంతి 2023 మెగా కుటుంబానికి చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. రామ్ చరణ్ త్వ‌ర‌లో తండ్రి కాబోతున్నాడు. చ‌ర‌ణ్‌ భార్య ఉపాసన మాతృత్వం స్వీక‌రించే వేళ ఆ ఇంట్లో సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఈ అంద‌మైన జంట‌ తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

సెల‌బ్రిటీ క‌పుల్ తమ మొదటి బిడ్డ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌లే ఉపాస‌న‌ గర్భం దాల్చినట్లు ప్రకటించారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ తొలి దశలో ఉన్న ఫోటోషూట్ ను ఉపాస‌న స్వ‌యంగా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. 'నాకు ఈ సంక్రాంతి మాతృత్వాన్ని సెల‌బ్రేట్ చేయ‌డం.. మా అంద‌రికీ కొత్త ప్రారంభం' అని ఇన్ స్టాలో ఎమోష‌న‌ల్ గా వ్యాఖ్యానించారు. ఉపాసనకు 70 ల‌క్ష‌ల (7 మిలియన్ల) మంది ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు.తరచుగా తన కుటుంబానికి సంబంధించిన విష‌యాల‌ను.. తన భర్త ఫోటోలను పోస్ట్ చేస్తారు. చ‌ర‌ణ్ న‌టించిన సినిమాల‌కు ప్ర‌చారం చేస్తుంటారు.

తరుణ్ తహిలియాని అల్మారాల‌ నుండి లేత గోధుమరంగు డిజైన‌ర్ డ్రెస్ ని ఎంపిక చేసుకున్న ఉపాస‌న ఈ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ పోస్ట్ ను షేర్ చేసిన వెంటనే బాలీవుడ్ క‌థానాయిక‌ హుమా ఖురేషి వ్యాఖ్యల‌ విభాగంలో హార్ట్ ఎమోటికాన్ ను షేర్ చేసారు. రామ్ చరణ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఉపాసన పోస్ట్ ను రీ-షేర్ చేస్తూ తన అభిమానులకు 'సంక్రాంతి శుభాకాంక్షలు' తెలిపారు.

రామ్ చరణ్ - ఎన్టీఆర్ నటించిన RRR పాట 'నాటు నాటు' గోల్డెన్ గ్లోబ్స్ 2023లో ఉత్తమ పాటల విభాగంలో అవార్డును కైవ‌శం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ అవార్డును గెలుచుకున్నప్పుడు రామ్ చరణ్ భార్య ఉపాసన భావోద్వేగ పోస్ట్ ను షేర్ చేసారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాతో పాటు నా బిడ్డ కూడా ఈ ఆనందాన్ని అనుభవించవచ్చు. నేను చాలా ఎమోషనల్ గా ఉన్నాను! అని ఆమె రాసింది. గోల్డెన్‌ గ్లోబ్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉపాసన ఇటీవల తన భర్త చరణ్ తో కలిసి అమెరికా వెళ్లారు. రామ్ చరణ్ 2012లో ఉపాసనను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.