Begin typing your search above and press return to search.
షారుఖ్.. సంజయ్ ల తర్వాత సౌత్ లో వీరిద్దరికి
By: Tupaki Desk | 24 Aug 2021 5:30 PM GMTమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరియు మెగా స్టార్ మమ్ముట్టీ లకు యూఏఈ ప్రభుత్వం అత్యంత అరుదైన గౌరవం అందజేసింది. ప్రపంచ దేశాల్లోని అత్యంత ప్రముఖులకు మాత్రమే దక్కే యూఏఈ గోల్డెన్ వీసా ను మోహన్ లాల్ మరియు మమ్ముట్టీ లకు తాజాగా ఇస్తున్నట్లుగా ప్రకటించారు. మోహన్ లాల్ ఈ గౌరవం దక్కిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. యూఏఈ కి కేరళకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. మలయాళీలు ఎంతో మంది అక్కడ సెటిల్ అయ్యి ఉంటారు. అందుకే మలయాళ సూపర్ స్టార్స్ ఇద్దరికి ఈ అరుదైన గౌరవం దక్కింది.
గతంలో బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్ మరియు సంజయ్ దత్ లకు మాత్రమే యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాను ఇవ్వడం జరిగింది. ఈ గోల్డెన్ వీసా ఉన్న వారు ఎప్పుడు అంటే అప్పుడు యూఏఈ కి వెళ్లడం చేయవచ్చు. అంతే కాకుండా అక్కడ స్థిర నీవాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా అక్కడ స్వేచ్చగా వ్యాపారాలు చేసుకునే వీలు కూడా ఉంటుంది. సాదారణంగా అయితే విదేశీయులు అక్కడ వ్యాపారం చేయాలంటే చాలా అనుమతులు అవసరం అవుతాయి. అంతే కాకుండా అక్కడి జాతీయ స్పాన్సర్ భాగస్వామ్యం కూడా కావాల్సి ఉంటుంది.
గోల్డెన్ వీసా ఉన్న వారు అవేవి లేకుండానే అక్కడ వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. అంతే కాకుండా గోల్డెన్ వీసా ఉన్న వారు యూఏఈ పౌరుగులుగా కూడా గుర్తించబడుతారు. ఇంకా ఎన్నో ప్రయోజనాలు చేకూరే యూఏఈ గోల్డెన్ వీసా ఎన్నో అద్బుతమైన అవకాశాలను కల్పిస్తుంది. వాటన్నింటిని పక్కన పెడితే అదో పెద్ద గౌరవంగా అంతా భావిస్తూ ఉంటారు. అలాంటి అరుదైన అద్బుతమైన గౌరవం సౌత్ స్టార్స్ అయిన మోహన్ లాల్ మరియు మమ్ముట్టీ లకు దక్కడం చాలా గొప్ప విషయం అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.