Begin typing your search above and press return to search.
కామెడీ సినిమాల్లో ఇదో రికార్డు
By: Tupaki Desk | 14 Nov 2017 5:57 PM GMTకామెడీ సినిమాలనగానే ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. అందులో చిన్న స్థాయి నటీనటులే నటిస్తారు. బడ్జెట్లు తక్కువుంటాయి. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే ఉంటాయి. ఐతే బాలీవుడ్లో రోహిత్ శెట్టి.. ప్రియ దర్శన్ లాంటి డైరెక్టర్లు ఈ ధోరణిని మార్చారు. పెద్ద పెద్ద హీరోల్ని పెట్టి భారీ స్థాయిలో కామెడీ సినిమాలు తీసి భారీ వసూళ్లు అందించారు. ఈ కోవలో బాలీవుడ్లో సూపర్ సక్సెస్ అయిన కామెడీ సినిమాల సిరీస్.. గోల్ మాల్.
ఈ సిరీస్ లో ఇంతకుముందు వచ్చిన మూడు సినిమాలూ మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ‘గోల్ మాల్ అగైన్’ వాటిని మంచి విజయం సాధించింది. ఇండియన్ కామెడీ సినిమాల చరిత్రలోనే ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్ల వసూల్లు రాబట్టడం విశేషం. ఇండియా వరకే ఈ చిత్ర వసూళ్లు రూ.200 కోట్ల మార్కును దాటాయి.
గత నెలలో దీపావళి కానుకగా విడుదలై ‘గోల్ మాల్-4’ ఆరంభం నుంచి అదిరిపోయే వసూళ్లు సాధిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర ఇండియన్ కలెక్షన్లు రూ.200 కోట్ల మార్కును దాటాయి. అమెరికాలో ఈ సినిమా రూ.46 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయడం విశేషం. వరల్డ్ వైడ్ వసూళ్లన్నీ కలిపితే రూ.300 కోట్ల దాకా ఉన్నాయట. ‘గోల్ మాల్’ సిరీస్ లో ఇంతకుముందు వచ్చిన సినిమాలకు కొంచెం భిన్నంగా హార్రర్ టచ్ ఇచ్చి ‘గోల్ మాల్ అగైన్’ తీశాడు రోహిత్. అజయ్ దేవగన్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు.