Begin typing your search above and press return to search.

టీజర్ టాక్ః రామ్ గోపాల్ వర్మ ఎవడ్రా?

By:  Tupaki Desk   |   15 Oct 2017 6:05 AM GMT
టీజర్ టాక్ః రామ్ గోపాల్ వర్మ ఎవడ్రా?
X
సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు రిజల్ట్ సంగతి తర్వాత. కానీ సినిమాకు ప్రమోషన్స్ కంటే ముందు అతి ముఖ్యమైన ట్రైలర్ ప్రధాన ఆయుధమనే చెప్పాలి. ఇప్పుడు అందరు ట్రైలర్ వైరల్ అయితేనే సినిమా విడుదలైన మొదటి షోకె వెళుతున్నారు. అదే తరహాలో వైరల్ అయ్యేలా తన మొదటి ట్రైలర్ ను క్రియేట్ చేశాడు అమృతం ఫేం హర్షవర్ధన్.

నటుడిగానే కాకుండా మాటల రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ మొదటిసారి తన దర్శకత్వ ప్రతిభను చూపించబోతున్నాడు. అలాగే మ్యూజిక్ ను కూడా అందిస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అనే సినిమా ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేసిన హర్ష చాలా డిఫరెంట్ గా సినిమాను తీస్తున్నాడనే చెప్పాలి. సినిమాలో తను దర్శకుడు అవ్వాలనే పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్ లో రామ్ గోపాల్ వర్మ - మణి రత్నం లని తిడుతూ పెద్ద హైప్ నే క్రియేట్ చేశాడు. వర్మ శివ సినిమా తీసేముందు టెస్ట షూట్ జరిపిన విషయం అందరికి తెలిసిందే. అలాంటి టైమ్ లో వర్మ సీన్స్ పై 'చైన్ తీసి కొట్టడం ఏంట్రా?' అని వెటకారంగా డైలాగులు.. అలాగే మెయిన్ గా అసలు ఈ 'రామ్ గోపాల్ వర్మ ఎవడ్రా?' అని కామెంట్స్ చేయడం చూస్తుంటే.. వర్మ పర్మిషన్ తీసుకున్నాడా? లేక ఆయన అప్పలరాజు సినిమాలో ఫ్రీడమ్ తీసుకున్నట్లు తీసుకున్నాడా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే విధంగా మణి రత్నం గీతాంజలి పై కూడా హర్ష కొన్ని కామెంట్స్ చేశాడు.

మొత్తానికి సినిమా ట్రైలర్ లో శ్రీముఖి అయితే కొంచెం హాటుగా కనిపిస్తోంది. ఇక మిగతా నటీనటులు కూడా పర్లేదు అనేలా ఉన్నారు. అయితే సినిమా ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్స్ వరకు రప్పిస్తుందా అనేది సందేహం గానే ఉంది. చూడాలి మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో. ఈ సినిమాకు సంగీతం కూడా హర్హవర్దనే అందిస్తున్నాడండోయ్.