Begin typing your search above and press return to search.
గుడ్ బై ట్రైలర్ టాక్ : హాస్యం+ ఎమోషన్!
By: Tupaki Desk | 6 Sep 2022 11:13 AM GMTనేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్న బాలీవుడ్ కెరీర్ పై దృష్టిపెట్టి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్ లు లైన్ లో పెడుతూ అమ్మడు వేగాన్ని అంతకంకు పెంచుతుంది. 'పుష్ప' తెచ్చిన పాన్ ఇండియా ఐడెంటిటీ అమ్మడికి వరంగా మరుతుంది. ట్యాలెంట్ తో పాటు అందం..అభినయం రష్మకని ఉత్తరాదిన బిజీ స్టార్ గా మార్చుతున్నాయి.
మూడు నాలుగు ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నా...ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే కొత్త అవకాశాలు ఒడిసిపట్టుకుంటుందంటే బ్యూటీ క్రేజ్ ఏ రేంజ్ లో వెలిగిపోతుందన్నది అద్దం పడుతుంది. ముందుగా బాలీవుడ్ లో 'మిషన్ మజ్ను' సినిమాతో ప్రేక్షకులు రావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ప్రాజెక్ట్ డిలే అవుతోంది.
ఈ నేపథ్యంలో లెజండరీ నటుడు బిగ్ బీ అమితాబచ్చన్ చిత్రంతోనే ముందుగా హిందీ ప్రేక్షకుల్ని మెప్పించడానికి రెడీ అవుతోంది. అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో...రష్మిక మందన్న..నీనా గుప్తా.. సునీల్ గ్రోవర్.. పావలి గులాటీ కీలక పాత్రలో వికాస్ బహల్ దర్శకత్వంలో 'గుడ్ బై' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ రిలీజ్ అయింది. ఇందులో బిగ్ బీ-రష్మిక తండ్రీ-కూతుళ్ల పాత్రల్లో నటిస్తున్నారు.
''ఉద్యోగం సంపాదించిన రష్మిక మొదటి జీతం పొందడంతో తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంటుంది. ఇకపై తన తండ్రి నుండి డబ్బు తీసుకోకూడదు అనుకుంటుంది. తల్లిదండ్రుల దగ్గర డబ్బులు అడగడంలో తప్పేమిటని ఆలోచించే ఓ పొసెసివ్ తండ్రి బిగ్ బి.ఇవి చిన్న సమస్యలే! కానీ బిగ్ బి -రష్మిక ప్రతి సిల్లీ రీజన్ కోసం గొడవ పడుతుంటారు.
వాటిని వినోదభరితంగా హైలైట్ చేసారు. అనుకోకుండా రష్మిక తల్లి పాత్రలో నటించిన నీనా గుప్తా చనిపోవడంతో తండ్రి కూతురు ఇద్దరూ అంత్యక్రియల గురించి గొడవ పడతారు. అంత్యక్రియలలో సంప్రదాయాలు మరియు ఆచారాలను పాటించాలని బిగ్ బి పట్టుదల. అయితే రష్మిక అన్ని ఆచారాలను చూసి చిరాకుపడుతుంది.
ఆ సన్నివేశాల్ని సైతం వినోదభరితంగా మలిచినట్లు కనిపిస్తుంది. అయితే అంత్యక్రియలు సమయంలో బలమైన ఎమోషన్ పిండిచినట్లు కనిపిస్తుంది. రష్మిక కెరీర్ లో ఇదొక డిఫరెంట్ రోల్ అని తెలుస్తోంది. సినిమాలో చాలా పాత్రలు కనిపిస్తున్నాయి. తె రంతా నిండుగా కనిపిస్తుంది. కథని ఓ ఇంటి చుట్టూనే ఎక్కువగా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.
'గుడ్‌బై' కథాంశం తెలుగులో రాజేంద్ర ప్రసాద్ నటించిన 'తోలు బొమ్మలాట' సినిమా నుంచి స్ఫూర్తి పొందింది. అయితే ఇందులో తండ్రీకూతుళ్ల గొడవలను ఎక్కువగా హైలైట్ చేసినట్లు కనిపిస్తుంది. 'క్వీన్'.. 'సూపర్ 30' ఫేమ్ వికాస్ బహల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసి అక్టోబర్ 7న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. గుడ్ కో...బాలాజీ మోషన్ పిక్చర్స్.. సరస్వతి ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.