Begin typing your search above and press return to search.

క‌నుమ కోడి కూర‌లా `ఆహా` అనిపించే క‌బురు

By:  Tupaki Desk   |   15 Jan 2021 7:36 AM GMT
క‌నుమ కోడి కూర‌లా `ఆహా` అనిపించే క‌బురు
X
భోగి-సంక్రాంతిని సంబురంగా జ‌రుపుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు. నేడు క‌నుమ పండ‌గ‌. గోదారి జిల్లాలు స‌హా అన్నిచోట్లా ఈ క‌నుమ రోజునా కోడి పందేలు జోరుమీదున్నాయి. అనుమ‌తుల్లేవ్ అంటూ పోలీసులు లాఠీల‌తో ప‌రుగులు పెట్టిస్తున్నారు. అదంతా స‌రే కానీ.. క‌నుమ‌కు ముందే సంక్రాంతి కానుక‌గా టాలీవుడ్ కి శుభ‌వార్త అందించారు బాస్ అల్లు అర‌వింద్.

ఆయ‌న ఇక‌పై ఆహా కోసం కోట్లాది రూపాయ‌ల్ని వెద‌జ‌ల్లుతూ తెలుగు కంటెంట్ ని విస్త్ర‌తంగా కొనుగోలు చేయ‌నున్నార‌న్నదే ఆ వార్త సారాంశం. ఇప్ప‌టికే ఒరిజిన‌ల్ మూవీస్ ని నిర్మిస్తూ జ‌నాద‌ర‌ణ పెంచుకోవ‌డంలో ఆహా ముందు వ‌రుస‌లో ఉంది. జ‌నం ఇప్పుడిప్పుడే థియేట‌ర్ల‌కు వెళుతున్నా ఓటీటీల్ని వ‌ద‌ల‌క‌పోవ‌డం ఆహా-తెలుగు ఓటీటీకి అన్నిరకాలా వ‌రంగా మారుతోంది.

అయితే ఈ సంక్రాంతి సినిమాల‌ను బేర‌మాడి ఆహాలో అందించేందుకు అల్లు అర‌వింద్ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఇప్ప‌టికే మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన క్రాక్ ని చేజిక్కించుకున్నారు. ఇది ఆహా తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. నాగ‌చైత‌న్య ల‌వ్ స్టోరిని కూడా ఆహా వాళ్లే ద‌క్కించుకున్నారు. దీంతో క్రేజు ఉన్న సినిమాల‌తో అభిమానుల‌కు జోష్ నింప‌నున్నారు ఆహా వాళ్లు. ఇక‌పైనా స‌బ్ స్క్రిప్ష‌న్లు ప‌రుగులు పెట్ట‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

అదంతా అటుంచితే అస‌లే క్రైసిస్ దెబ్బ‌కు విల‌విల్లాడిన టాలీవుడ్ కి ఇలాంటివి మంచి క‌బురే అని చెప్పాలి. అమెరికా మార్కెట్ స‌హా టాలీవుడ్ కి విదేశీ మార్కెట్ లేకుండా పోయింది. క్రైసిస్ పోయే వర‌కూ మిడ్ రేంజు నుంచి భారీ బ‌డ్జెట్ల‌తో తెర‌కెక్కే పెద్ద సినిమాల‌కు ఇది పెద్ద స‌మ‌స్య. క‌నీసం ఇలా డిజిట‌ల్ వేదిక‌ల‌పై పోటీ వ‌ల్ల అయినా కొంత‌వ‌ర‌కూ క‌లిసి రావొచ్చ‌ని అంచ‌నా. అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్.. హాట్ స్టార్.. స‌హా ప‌లు డిజిట‌ల్ స్ట్రీమింగ్ సంస్థ‌ల‌తో పోటీప‌డుతూ ఇలా తెలుగు చిత్రాల్ని వ‌రుస పెట్టి కొనేందుకు `ఆహా` త‌ర‌పున అర‌వింద్ ముందుకు రావ‌డం హ‌ర్ష‌ణీయం.