Begin typing your search above and press return to search.

కార్తీకి ప్లస్ విశాల్ కి మైనస్

By:  Tupaki Desk   |   2 Nov 2019 8:59 AM GMT
కార్తీకి ప్లస్ విశాల్ కి మైనస్
X
తెలుగు ప్రేక్షకులకు టైటిల్ సెంటిమెంట్ అనేది ఒకటుంది. ఒక సూపర్ హిట్ టైటిల్ ను మళ్లీ వాడినా ఫ్లాప్ టైటిల్ తో సినిమా వస్తున్నా అందరి చూపు ఆ సినిమా రిజల్ట్ మీదే ఉంటుంది. అయితే ఇప్పుటికే కొన్ని టైటిల్స్ ఆ సెంటిమెంట్ ను ఋజువుచేసుకున్నాయి కూడా. లేటెస్ట్ గా కార్తి సినిమాకు తెలుగులో మెగా స్టార్ కల్ట్ బ్లాక్ బస్టర్ 'ఖైదీ' అనే టైటిల్ పెట్టారు. సినిమాలో కంటెంట్ ఉండటం పక్కన పెడితే ఆ టైటిల్ పవర్ కార్తి కి బాగా కలిసొచ్చింది.

ఎన్ని ప్రయోగాలతో వచ్చినా కార్తికి ఇంత గొప్ప ఫీడ్ బ్యాక్ రాలేదు. ఆ విషయంలో ఖైదీ కార్తిను మరో లెవెల్ లో నిలబెట్టింది. అయితే కార్తి ఓ హిట్ టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తే ఇప్పుడు విశాల్ ఓ ఫ్లాప్ టైటిల్ తో వస్తున్నాడు. అవును విశాల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా యాక్షన్ అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా అదే టైటిల్ తో విడుదల కానుంది.

అయితే ఈ టైటిల్ కి ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. గతంలో అల్లరి నరేష్, రాజు సుందరం , వైభవ్ లతో ఇదే టైటిల్ తో అనిల్ సుంకర తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్ విశాల్ సినిమాపై ఎంతటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.