Begin typing your search above and press return to search.
'గుడ్ లక్ సఖి' మరోసారి వాయిదా!
By: Tupaki Desk | 6 Dec 2021 9:32 AM GMTకీర్తి సురేశ్ 'మహానటి' తరువాత అదే ఉత్సాహంతో కొన్ని లేడీ ఓరియెంటెడ్ కథలను ఒప్పేసుకుంది. ఆ సినిమాలన్నీ కూడా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయాయి. ఆ బంచ్ లో మిగిలిపోయి దోబూచులాడుతున్న సినిమానే 'గుడ్ లక్ సఖి'. ఈ సినిమా విడుదలకి ముస్తాబై చాలాకాలమే అయింది.
అప్పటి నుంచి ఊరిస్తుందే తప్ప ఉన్నపళంగా ముందుకురాదు. నిజం చెప్పాలంటే ఈ సినిమా విడుదలైపోయిందా? విడుదల కావలసి ఉందా? అనే సందేహం జనానికి లేకపోలేదు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల తేదీని మరోసారి వాయిదా వేశారు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ మళ్లీ కొన్ని అనివార్య కారణాల వలన అంటూ ఈ నెల 31వ తేదీకి వాయిదా వేశారు.
అలా వాయిదా వేసిన విషయాన్ని ప్రకటిస్తూ అధికారిక పోస్టర్ ను వదిలారు కూడా. సుధీర్ చంద్ర నిర్మించిన ఈ సినిమాకి, నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. ఆది పినిశెట్టి .. జగపతిబాబు .. రమాప్రభ కీలకమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
ఆ మధ్య ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను వదిలారు. నాయిక ఎదురుపడితే ఎవరికీ ఏ పనులు కావు అనే విషయం అర్థమయ్యేలా ఆ పాటలో చూపించారు. ఆమె ఎదురుపడితే చాలు అందరూ భయపడిపోతుంటారు .. సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకుని ఊళ్లో నుంచి వెళ్లిపో తల్లీ అంటుంటారు.
ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ ను బట్టి చూస్తే కథలో కామెడీ పాళ్లు బాగానే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా ఈ నెల చివరి రోజున ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైపోయిందన్నమాట.
ఇక కీర్తి సురేశ్ ఈ సినిమా తరువాత నాయిక ప్రధానమైన కథలను ఎంచుకోవడం మానేసింది. స్టార్ హీరోల సరసన నాయికగా ఆడిపాడే పాత్రలకే ఆమె ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తోంది. తెలుగులో ఆమె తాజా చిత్రంగా 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది.
ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో నిర్మితమవుతున్న ఈ సినిమాను, ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో పాటు తమిళంలోని 'సానికాయిధం'పై కీర్తి ఆశలు పెట్టుకుంది.