Begin typing your search above and press return to search.

చిరు, బాల‌య్య‌కు ఇక్క‌డ అక్క‌డ‌ గుడ్ న్యూస్!

By:  Tupaki Desk   |   11 Jan 2023 10:40 AM GMT
చిరు, బాల‌య్య‌కు ఇక్క‌డ అక్క‌డ‌ గుడ్ న్యూస్!
X
ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు విడుద‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. తెలుగు నుంచి మూడు సినిమాలు రిలీజ్ అవుతుండ‌గా, తమిళ డ‌బ్బింగ్ సినిమాలు రెండు మ‌న తెలుగు సినిమాల‌తో పోటీప‌డుతున్నాయి. అయితే ఈ ఐదు సినిమాల్లో తెలుగు ప్రేక్ష‌కుల దృష్టి మాత్రం ప్ర‌ధానంగా తెలుగు సినిమాల‌పైనే వుంది. అందులోనూ అగ్ర క‌థానాయ‌కులు నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన‌ 'వీర సింహారెడ్డి'తో పాటు మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీర‌య్య‌'ల‌పైనే వుంది.

ఇప్ప‌టికే విడుద‌లైన ఈ రెండు సినిమాల టీజ‌ర్‌, ట్రైల‌ర్స్ సినిమాల‌పై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెంచేశాయి. దీంతో సంక్రాంతి బ‌రిలో ఎవ‌రు పై చేయి సాధిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా వుంటే బాల‌కృష్ణ న‌టించిన‌ 'వీర సింహారెడ్డి'తో పాటు మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీర‌య్య‌'ల అభిమానుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జ‌న‌వ‌రి 12న‌, 13న విడుద‌ల‌వుతున్న ఈ రెండు సినిమాల‌కు ఆరు షోలు ప్ర‌ద‌ర్శించుకునే విధంగా వెసులుబాటుని క‌ల్పించింది.

ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం అధికారికంగా ఓ జీవోని విడుద‌ల చేయ‌డంతో చిరు, బాల‌య్య ఫ్యాన్స్ తో పాటే మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు హ‌ర్షం వ్యక్తం చేశారు. భారీ బ‌డ్జెట్ తో రూపొంది సంక్రాంతి బ‌రిలో పోటీప‌డుతున్న ఈ రెండు సినిమాల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నిర్ణ‌యం మ‌రింత ప్రోత్సాహ‌కంగా మారింది. ఇదిలా వుంటే ఈ రెండు సినిమాల‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన విష‌యం తెలిసిందే.

తెలంగాణ లో ప్ర‌భుత్వం నుంచి ఈ రెండు సినిమాల‌కు భారీ స‌పోర్ట్ ల‌భించిన నేప‌థ్యంలో ఏపీ ప‌రిస్థితేంటీ? .. టికెట్ రేట్ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం ఎలా స్సందించ‌నుంది అనే కామెంట్ లు మొద‌ల‌య్యాయి. గ‌త కొన్ని రోజులుగా ఈ విష‌యం గురించి మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో ట‌చ్ లో వుంటున్నార‌ని, త్వ‌ర‌లోనే దీనిపై ఓ ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు వినిపించాయి.

అంతే కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టికెట్ రేట్లు బాల‌య్య 'వీర సింహారెడ్డి'కి రూ. 20, చిరు 'వాల్తేరు వీర‌య్య‌'కు రూ. 25 పెంచుకునే విధంగా ప్ర‌భుత్వం అనుమ‌తి ఇస్తూ ఓ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశ వుంద‌ని కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే ఏపీలో 'బాల‌య్య 'వీర సింహారెడ్డి'కి రూ. 20, చిరు 'వాల్తేరు వీర‌య్య‌'కు రూ. 25 పెంచుకునే విధంగా ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఉభ‌య తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి సినిమాల‌కు త‌మ వంతు స‌హ‌కారం అందించ‌డం విశేషం అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.