Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కి తీపికబురు చెప్తానంటున్న స్టార్ హీరో..

By:  Tupaki Desk   |   17 April 2020 10:30 AM GMT
ఫ్యాన్స్ కి తీపికబురు చెప్తానంటున్న స్టార్ హీరో..
X
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ గతేడాది సాహో సినిమాతో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి లాంటి భారీ సక్సెస్ తర్వాత వచ్చిన మూవీ కాబట్టి సాహో పై అంచనాలు భారీ స్థాయిలో నిలిచాయి. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కానప్పటికీ వసూళ్లు మాత్రం భారీగా సాధించింది. ఇక ఈ సినిమా తరవాత ప్రభాస్ యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లో జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఫ్యాన్స్ కి సరైన అప్ డేట్స్ అందడం లేదు.

కానీ డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అప్ డేట్స్ ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఒక అప్‌ డేట్‌ ను అభిమానులతో పంచుకుంది. ఓ క్రేజీ ఛేజింగ్‌ సీన్‌ లో ప్రభాస్‌ పాల్గొన్న దృశ్యాలను షూట్‌ చేసినట్టు ట్విట్టర్ లో పేర్కొంది. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రొఫెషనల్స్‌ సహకారంతో ఈ సీన్‌ ను తెరకెక్కించామని - ఇక యూరప్‌ లో భారీ షెడ్యూల్‌ ను ప్లాన్‌ చేశామని - మరిన్ని అప్‌ డేట్స్‌ త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ 20 రోజుల షెడ్యూల్‌ కోసం జార్జియాలో కీలక సన్నివేశాలను తెరకెక్కించి లాక్ డౌన్ లో ఉంది.

పూర్వజన్మల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అయితే రెండేళ్లుగా ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇంతవరకు టైటిల్ ఖరారు చేయపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశకు గురై ఆగ్రహిస్తున్నారు. ఫైనల్ గా ప్రభాస్ అభిమానుల ఆగ్రహం గురించి తెలుసుకొని ఒక ప్లాన్ వేశాడట. కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కానుంది కాబట్టి ఈ గ్యాప్ లో ఫైనల్ టైటిల్ ని ఎనౌన్స్ చేయించేందుకు రెడీ అయ్యారట.

ఆ తరువాత చిన్న టీజర్ లాంటి క్లిప్ ని రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలకు సలహా ఇచ్చారట. మొత్తానికి అభిమానుల కోపాన్ని తగ్గించేందుకు ప్రభాస్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా అనంతరం ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమాని వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఈ సినిమాని డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకు వెళ్లనున్నట్లు సమాచారం. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ గ్రాప్ లో సినిమా ఉంటుందని తెలుస్తోంది! సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.