Begin typing your search above and press return to search.

'కేజీఎఫ్ 2' ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రాకీభాయ్..!

By:  Tupaki Desk   |   29 Jan 2021 2:30 PM GMT
కేజీఎఫ్ 2 ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రాకీభాయ్..!
X
కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన 'కేజీఎఫ్‌' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మొదటి భాగాన్ని మించిన యాక్షన్ సీన్స్ తో చాప్టర్ 2 ని రూపొందిస్తున్నారు. హెంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఈ సినిమాలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్ - రవీనా టాండన్ నటిస్తున్నారు. విలన్ అధీర పాత్రలో సంజయ్ కనిపించనుండగా.. ప్రధాన మంత్రి పాత్రలో రవీనా టాండన్ నటిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ క్రమంలో తాజాగా 'కేజీఎఫ్ 2' విడుదల తేదీని ప్రకటించారు.

'కేజీఎఫ్ చాప్టర్ 2' చిత్రాన్ని జూలై 16న (16.07.2021) తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగులో ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం వారు విడుదల చేయనున్నారు. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా.. ప్రకాష్ రాజ్ - రావు రమేష్ - ఈశ్వరీ రావు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రవి బాస్రుర్ సంగీతం సమకూరుస్తుండగా.. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి.