Begin typing your search above and press return to search.

సినిమా, షాపింగ్ ప్రియులకు శుభవార్త

By:  Tupaki Desk   |   9 May 2020 3:50 AM GMT
సినిమా, షాపింగ్ ప్రియులకు శుభవార్త
X
దేశంలో లాక్ డౌన్ ను మూడు కేటగిరీలుగా చేసి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా చేసిన కేంద్రం ఇప్పుడు జనాలకు ఎంటర్ టైన్ మెంట్ అందించే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ తెరవడానికి నిబంధనలు రూపొందిస్తోంది. వీటి ఓపెన్ తేదిని కూడా ఖరారు చేసినట్టు తెలిసింది.

దీంతో సినిమా, షాపింగ్ ప్రియులకు శుభవార్త అందడం ఖాయంగా కనిపిస్తోంది. మార్చి 25 నుంచి మూతబడిన సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ త్వరలోనే తెరుచుకోబోతున్నాయి. జనసమూహం ఎక్కువగా గుమిగూడే వీటివల్ల కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువని ఇన్నాళ్లు మూసివేశారు. వీటినే చివరగా తెరుస్తారని భావించారు.

అయితే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో వెసులుబాటును ఇచ్చిన ప్రభుత్వం ఇక్కడ మాత్రం సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ ఓపెన్ పై నిషేధం విధించింది. ఆరెంజ్ జోన్ లో కొంతవరకు సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం... గ్రీన్ జోన్లలో మొత్తం కార్యకలాపాలను ప్రారంభిస్తోంది.

ప్రధాని మోడీ మే 17వరకు దేశంలో లాక్ డౌన్ విధించారు. దీంతో ఆ తర్వాత భారీగా మినహాయింపులు ఇస్తారని తెలుస్తోంది. ఈనెల 18నుంచి సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ కు అనుమతించే అవకాశం ఉందంటున్నారు.

సినిమా, షాపింగ్ మాల్స్ పై ఆధారపడి కోట్ల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఎంటర్ టైన్ మెంట్ అందించే దిశగా కేంద్రం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ క్రమంలోనే ఈనెల 18నుంచి గ్రీన్ జోన్ లో షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

రెడ్ జోన్స్, ఆరెంజ్ జోన్స్ లో వదిలేసి గ్రీన్ జోన్ లో మూడు షోలకు సినిమాలు ప్రదర్శించేందుకు థియేటర్స్ కు అనుమతి ఇస్తోంది. రాత్రి 7 గంటలలోపే సినిమా ఆటలు పూర్తయ్యేలా షరతు పెట్టనుందట.. ఇక సినిమా హాల్ లో సీటుకి సీటుకి మధ్య ఒక సీటు గ్యాప్ ఉండేలా చూసుకోవాలని సూచించింది. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలనే నిబంధన పెడుతున్నాడు. మాస్క్ ధరించడం కంపల్సరీ. మాల్స్ కు ఇదే తరహా నిబంధలు పెడుతున్నారని తెలిసింది. ఇలా సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ ఈనెల 18నుంచి తెరిపించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.దీంతో సినీ ప్రియులు, షాపింగ్ ప్రియులకు గొప్ప ఊరట లభించనుంది.దీనిపై ఆధారపడిన వారికి ఇదో గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.