Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. నిజమేనా?
By: Tupaki Desk | 26 July 2022 1:30 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ `RRR` కోసం దాదాపు మూడేళ్లు కేటాయించారు. రీసెంట్ గానే ఈ మూవీ విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన రామ్ చరణ్ వెంటనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో నిమగ్నమైపోయాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇంత వరకు తన తదుపరి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించలేకపోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రంగా తన 30వ ప్రాజెక్ట్ ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20న ఈ మూవీ ఫస్ట్ లుక్ డైలాగ్ మోషన్ పోస్టర్ ని విడుదల చేస్తూ పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నామంటూ ప్రకటించారు. అయితే ఇంత వరకు ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్ డేట్ బయటికి రావడం లేదు.
జూన్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందంటూ వార్తలు వినిపించాయి. అయితే ఫైనల్ స్క్రిప్ట్ లాక్ కాకపోవడం వల్లే రెగ్యులర్ షూటింగ్ ని వాయిదా వేస్తున్నారని తెలిసింది. అంతే కాకుండా దర్శకుడు కొరటాల శివ చుట్టూ `ఆచార్య` సమస్యలు వుండటంతో వాటిని క్లియర్ చేసుకున్న తరువాతే తన సినిమాని పట్టాలెక్కిద్దామని ఎన్టీఆర్ అనడంతో గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరో క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? అని ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టుగా తెలుసస్తోంది.
చాలా రోజులుగా ఎదురుచూస్తున్నఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని సెప్టెంబర్ రెండవ వారం నుంచి స్టార్ట్ చేయబోతున్నారట. ఇది నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూసే.
ఇప్పటికే ఈ మూవీ కోసం జూబ్లీ హిల్స్ లోని ఓ ప్రదేశంలో ప్రత్యేకంగా సెట్ ని కూడా పూర్తి చేశారట. దీనికి ప్రస్తుతం కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నారట. ఇదిలా వుంటే ఎన్టీఆర్ లుక్, మేకోవర్ చాలా కొత్తగా వుండబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం మేకోవర్ కోసం వర్కవుట్ లు చేస్తూ బరువు తగ్గుతున్న ఎన్టీఆర్ సరికొత్త మేకోవర్ తో ఈ మూవీలో సర్ ప్రైజింగ్ లుక్ లో కనిపించనున్నాడని చెబుతున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.