Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి 'స‌లార్‌' టీమ్ గుడ్ న్యూస్‌!

By:  Tupaki Desk   |   15 Aug 2022 8:30 AM GMT
ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి స‌లార్‌ టీమ్ గుడ్ న్యూస్‌!
X
కన్న‌డ రాక్ స్టార్ య‌ష్ తో ఊహించ‌ని విధంగా 'కేజీఎఫ్‌' సీరీస్ సినిమాల‌తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌. అలాంటి ద‌ర్శ‌కుడితో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సినిమా అన‌గానే ఫ్యాన్స్ లో అంచ‌నాలు అంబ‌రాన్ని తాకాయి. ప‌వ‌ర్ ఫుల్ పీపుల్స్ మేక్ ప్లేసెస్ ప‌వ‌ర్ ఫుల్ అన్న‌ట్టు.. ఈ ఇద్ద‌రు ప‌వర్ వ‌ప‌ర్ ఫుల్ వ్య‌క్తుల క‌ల‌యిక‌లో వ‌స్తున్న 'స‌లార్‌' మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ గా వుంటుంద‌ని ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

రీసెంట్ గా ప్ర‌భాస్ చేసిన సినిమా 'రాధేశ్యామ్‌' ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ దృష్టి మొత్తం 'స‌లార్'పైనే వుంది. ఈ మూవీతో పాటు ప్ర‌భాస్ మ‌రో రెండు భారీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తో మైథ‌లాజిక‌ల్ మూవీ 'ఆది పురుష్‌'లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా గ్రాఫిక్స్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది.

ఇక 'మ‌హాన‌టి' ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో 'ప్రాజెక్ట్ కె'ని చేస్తున్నారు. ఇది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేప‌థ్యంలో సాగే సైన్స్ ఫిక్ష‌న్ గా తెర‌పైకి రాబోతోంది. ఇప్ప‌టికే దాదాపుగా 50 శాతం వ‌ర‌కు చిత్రీక‌ర‌ణ ని పూర్తి చేశారు. త్వ‌ర‌లో జ‌రగ‌బోయే షెడ్యూల్స్ తో సినిమాని పూర్తి చేయాడానికి ప్లాన్ చేస్తున్నారు. 'స‌లార్'కి ముందు 'ఆదిపురుష్‌' భారీ స్థాయిలో రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతున్నా ఫ్యాన్స్ హోప్ మాత్రం ప‌క్కా మాస్ హైవోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న‌ 'స‌లార్‌' మూవీ పైనే ప్ర‌ధానంగా వుంది.

కార‌ణం ప్ర‌భాస్ నుంచి త‌మ‌కు కావాల్సిన మాసీవ్ అంశాలు ఈ మూవీలోనే వుండే అవ‌కాశం వుంది కాబ‌ట్టి. అందుకే ఫ్యాన్స్ 'స‌లార్‌' రిలీజ్ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. 'కేజీఎఫ్ 2' రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించ‌డంతో 'స‌లార్‌' అంత‌కు మించి వుండే అవ‌కాశం వుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే ఈ మూవీ కోస‌మే ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్, లేటెస్ట్ అప్ డేట్ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా? అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల‌కు 75వ‌ స్వాతంత్య దినోత్స‌వం సంద‌ర్భంగా మేక‌ర్స్ గుడ్ న్యూస్ చెప్పారు.

ఫ్యాన్స్ ఊహించ‌ని విధంగా మేక‌ర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించిన బిగ్ స‌ర్ ప్రైజ్ ఇచ్చారు. వ‌చ్చే ఏడాది సెప్టెంబ‌ర్ 28న ఈ మూవీని వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల చేయ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్ టెర్రిఫిక్ గా వుంది.

దీంతో ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా 'స‌లార్ ఆగ‌మ‌నం' అనే హ్యాష్ ట్యాక్ ని ట్రెండ్ చేస్తూ నెట్టింట సంబ‌రాలు చేసుకుంటున్నారు. మ‌రి కొంత మంది అన్న వ‌స్తుండు అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా హంగామా మొద‌లు పెట్టారు. ప్ర‌స్తుతం 'స‌లార్‌' రిలీజ్ డేట్ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ గా మారి ట్రెండ్ అవుతోంది.