Begin typing your search above and press return to search.

రాఖీ భాయ్ అభిమానులకు గుడ్ న్యూస్‌

By:  Tupaki Desk   |   20 Dec 2022 5:42 AM GMT
రాఖీ భాయ్ అభిమానులకు గుడ్ న్యూస్‌
X
కేజీఎఫ్ సినిమాకు ముందు కన్నడంలో తప్ప ఇతర భాషల్లో పెద్దగా యశ్‌ గురించి తెలియదు. యశ్‌ సినిమా లు కన్నడ సినిమా ఇండస్ట్రీ వరకే పరిమితం అయ్యి ఉండేవి. కానీ ఇప్పుడు యశ్ సినిమా అంటే దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. అన్ని భాషల్లో కూడా యశ్‌ కి అభిమానులు అయ్యారు. అన్ని భాషల వారు యశ్‌ తదుపరి సినిమా ఏంటీ.. ఎప్పుడు ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

యశ్‌ కేజీఎఫ్ సినిమా తర్వాత కన్నడ సూపర్‌ స్టార్‌ గానే కాకుండా పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నాడు. కేజీఎఫ్‌ 2 కి వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రావడంతో యశ్‌ తదుపరి సినిమా అదే స్థాయిలో ఉండాలని అభిమానులు ఆశ పడుతున్నారు. యశ్‌ కూడా కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా పర్వాలేదు కానీ మరో కేజీఎఫ్ రేంజ్ సినిమా చేయాలని భావిస్తున్నాడట.

ఎట్టకేలకు యశ్‌ తదుపరి సినిమా యొక్క ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. ఆయన పుట్టిన రోజు అయిన జనవరి 8న సినిమాకు సంబంధించిన ప్రకటన ఉండబోతుందని తెలుస్తోంది. ఈసారి యశ్ చేయబోతున్న సినిమా పాన్ ఇండియా ను మించి ఉండబోతుందని... ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ తో వర్క్ చేయబోతున్నాడని తెలుస్తోంది.

యశ్‌ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తదుపరి సినిమా విషయంలో తొందరపడాలని భావించడం లేదు. కచ్చితంగా మెల్లగానే సినిమాలు చేస్తాను అన్నట్లుగా పేర్కొన్నాడు. సినిమా కన్ఫర్మ్‌ అయ్యాక అన్ని విషయాలను నేను స్వయంగా వెళ్లడిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

రాఖీ భాయ్ గా దేశవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న యశ్ తదుపరి సినిమా బడ్జెట్‌ మరియు ఇతర విషయాల పట్ల అంతా ఆసక్తిగా ఉన్నారు. తెలుగు లో కూడా యశ్‌ సినిమాలు భారీ ఎత్తున ఆసక్తిని కలిగి ఉన్నాయి. యశ్‌ తదుపరి సినిమా వందల కోట్ల బడ్జెట్‌ తో రూపొందే అవకాశాలు ఉన్నాయట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.