Begin typing your search above and press return to search.

#రాధేశ్యామ్ ఫ్యాన్స్ కి రిలీజ్ పై శుభ‌వార్త‌

By:  Tupaki Desk   |   2 Feb 2022 4:12 AM GMT
#రాధేశ్యామ్ ఫ్యాన్స్ కి రిలీజ్ పై శుభ‌వార్త‌
X
సాహో త‌ర్వాత రెండున్న‌రేళ్లుగా ప్ర‌భాస్ అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాసేలా వేచి చూస్తున్న సంగ‌తి తెలిసిందే. రాధేశ్యామ్ సెట్స్ కెళ్లింది మొద‌లు అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వూతూనే ఉంది. చివ‌రికి మ‌హమ్మారీ వ‌ల్ల రిలీజ్ కూడా డిలే అయ్యింది. ప‌లుమార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు అన్ని ఊహాగానాలకు ముగింపు ఇస్తూ 11మార్చి 2022న విడుద‌ల‌వుతోంది. ఆ మేర‌కు నిర్మాత‌లు అధికారికంగా రిలీజ్ తేదీని ప్ర‌క‌టించారు. సంక్రాంతి రేసు నుంచి వైదొలిగాక స‌రైన రిలీజ్ తేదీ కోసం వేచి చూసిన యువి క్రియేష‌న్స్ కి ఇప్ప‌టికి పూర్తి క్లారిటీ వ‌చ్చింది.

ర‌క‌ర‌కాల త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల అనంత‌రం ప్రభాస్ గోపికృష్ణ మూవీస్ తో క‌లిసి యువి సంస్థ‌- టి సిరీస్ ఈ తేదీని లాక్ చేశాయి. వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయాలనే ఆలోచ‌నతోనే రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసేశారు. ఆస‌క్తిక‌రంగా మార్చి 11 తేదీకి వేరొక పెద్ద సినిమా ఏదీ లేదు. పాన్-ఇండియన్ సినిమాలేవీ లేక‌పోవ‌డం పెద్ద ప్ల‌స్ కానుంది.

ఇప్ప‌టికే ఉత్త‌రాదిన కర్ఫ్యూలు ఎత్తేస్తుంటే రాధేశ్యామ్ టీమ్ లో ఆనందం క‌నిపిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే కర్ఫ్యూను ఎత్తివేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫిబ్రవరిలో కొత్త టిక్కెట్ ధరలను ప్రకటించే అవకాశం ఉంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే ఇది మంచి రిలీజ్ తేదీ అని విశ్లేషిస్తున్నారు.

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్ర‌భాస్- పూజా హెగ్డే ప్రేమికులుగా నటించారు. ప్రేర‌ణ ప్రేమ కోసం త‌పించేవాడిగా ప్ర‌భాస్ క‌నిపించ‌నున్నాడు. అత‌డు వింటేజ్ కార్ల వ్యాపారిగా రిచ్ గ‌య్ గా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. యూర‌ప్ నేప‌థ్యంలోని అంద‌మైన లొకేష‌న్ల‌లో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇందులో ల‌వ్ రొమాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండ‌నున్నాయ‌ని ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ విజువ‌ల్స్ వెల్ల‌డించాయి. తాజాగా .. రిలీజ్ తేదీని ప్ర‌క‌టిస్తూ మార్చి 11 నుంచి ప్రేమ‌లో ప‌డండి! అంటూ టీమ్ ప్ర‌క‌టించింది.