Begin typing your search above and press return to search.

బాల్డ్ హెడ్ బాలీవుడ్ సినిమాకు మంచి టాక్!

By:  Tupaki Desk   |   8 Nov 2019 8:07 AM GMT
బాల్డ్ హెడ్ బాలీవుడ్ సినిమాకు మంచి టాక్!
X
గతంలో సినిమా హీరో హీరోయిన్ల పాత్రలు అన్నీ మంచి లక్షణాలతో ఉండేవి. శారీరకంగా ఎలాంటి అవకరాలు ఉండేవి కాదు. ఏదో నూటికి కోటికి తప్ప అధికశాతం సినిమాల్లో హీరో హీరోయిన్లు రోల్ మోడల్ తరహాలో ఉండేవారు. ఇప్పుడు కూడా అలాంటి హీరో హీరోయిన్ల పాత్రలు ఉన్నాయి కానీ శారీరక.. మానసిక లోపాలు ఉండే పాత్రలను మన దర్శకులు డిజైన్ చేస్తున్నారు. నిజాని కి సినిమా డిఫరెంట్ గా అనిపించేందుకు ఏదో ఒక లోపం ఉండేలా ప్రధాన పాత్రలను తీర్చిదిద్దుతున్నారు. ఇదే ట్రెండ్ లో వచ్చిన హిందీ చిత్రం 'బాలా'.

అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా.. భూమి పెడ్నేకర్.. యామి గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బాలా'. ఈ సినిమా నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ విజయాలు సాధిస్తున్న ఆయుష్మాన్ హీరో కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి నమ్మకమే ఉంది. మరి సినిమా ఎలా ఉంది అంటే.. దాదాపుగా అందరూ 3 రేటింగ్ ఇచ్చారు. కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ మంచి ఎంటర్టైనర్ అంటూ కితాబివ్వడం విశేషం.

సినిమా విషయానికి వస్తే హీరోకు బట్ట తల. మెడపై తల లేకుండా ఉండే జనాలు ఎలా చూస్తారో.. తలపై జుట్టులేకపోతే అలా చూస్తారు మన జనాలు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు బట్టనెత్తి బాధితులు ఉంటారు కాబట్టి ఇది చాలా కామన్ ప్రాబ్లెం. గతంలో యాభైలు అరవైలు దాటితే ఈ సమస్య తలెత్తేది.. ఇప్పుడు ఇరవైల్లోనే అరవైలు కనిపిస్తున్నాయి. ఈ బాల్డ్ హెడ్ సమస్యతో హీరో పడే కష్టాలు 'బాలా' మెయిన్ థీమ్. బట్టనెత్తి రాకుండా జుట్టు మొలవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. దీంతోనే బోల్డంత ఫన్ జెనరేట్ అవుతుంది కదా. ఇక ఇంతటి ఆగలేదు. ఈ సినిమాలో ఇంకా ఇంట్రెస్టింగ్ అంశాలున్నాయి.

భూమి పెడ్నేకర్ ఈ సినిమాలు కాస్త నలుపు రంగు లో ఉండే పాత్ర పోషించింది. అమ్మాయి నలుపుగా ఉంటే అదో పెద్ద అంతర్జాతీయ సమస్య కదా. మరో హీరోయిన్ యామి గౌతమ్ కు చదువుసంధ్యలు ఉండవు.. అయితే తెల్లగా మిల్కీ బ్యూటీలా ఉంటుంది. టిక్ టాక్ లతో దుమ్ములేపుతూ ఉంటుంది. మాటిమాటికి టిక్ టాక్ వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంటుంది. బాలా సినిమాలో ప్రధాన పాత్రలు ఇవి. ఇక వీరి మధ్య సంభాషణల లో కామెడీకి తప్పనిసరిగా స్కోప్ ఉంటుంది కదా. ఓవరాల్ గా సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉందని.. వీకెండ్ లో ఒక లుక్ వెయ్యోచ్చని అంటున్నారు.