Begin typing your search above and press return to search.

కొత్త కుర్రాళ్ల‌కి క‌లిసొచ్చే టైమొచ్చింది!

By:  Tupaki Desk   |   2 Sep 2022 9:30 AM GMT
కొత్త కుర్రాళ్ల‌కి క‌లిసొచ్చే టైమొచ్చింది!
X
గ‌డిచిన ద‌శాబ్ధ కాలంలో టాలీవుడ్ లో ఎన్నో మార్పులొచ్చాయి. ముఖ్యంగా న‌వ‌త‌రం ప్ర‌తివంతుల్ని ఇండ‌స్ర్టీ ప్రోత్స‌హించ‌డం ఎక్కువైంది. ఒక‌ప్పుడు అవ‌కాశం క‌ల్పించాలంటే? ఎన్నో స‌మీక‌ర‌ణాలుండేవి. కానీ ఇప్పుడు ప్ర‌తిభ‌కి మాత్ర‌మే ప‌ట్టం క‌డుతున్నారు. ట్యాలెంట్ ఉంటే? అవ‌కాశం నీదే? కాక‌పోతే ఆ ఛాన్స్ వ‌చ్చే వ‌ర‌కూ ఓపిగ్గా వెయిట్ చేయాలి.

నిరూపించుకోవ‌డానికి మాత్రం రక‌ర‌కాల వేదిక‌లున్నాయి. షార్ట్ ఫిలింస్ ద్వారా సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకునే వెసులుబాటు ఉండ‌టంతోనే ఇదంతా సాధ్య‌మైంది. ద‌శాబ్ధ కాలంలో ఎంతో మంది కొత్త వాళ్లు వ‌చ్చి స‌క్సెస్ అయ్యారు. ఓటీటీ వేదిక‌లు అవ‌కాశం క‌ల్పించ‌డం..అక్క‌డ నుంచి వెండి తెర‌కు ప్ర‌మోట్ అవ్వ‌డం వంటివి కొంత కాలంగా నిత్య‌కృత్యంగా సాగుతోంది.

అయితే ఇటీవ‌లి కాలంలో మ‌రిన్ని మార్పులు క‌నిపిస్తున్నాయి. ఇమేజ్ తో సంబంధం లేకుండా సినిమాలు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతున్నాయి. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా రోటీన్ గా ఉంటే చూసే రోజులు పోయాయ‌ని కొన్ని సినిమాలు ఇటీవ‌లి కాలంలో రుజువు చేసిన సంగ‌తి తెలిసిందే. 'కార్తికేయ‌-2' లాంటి సినిమా 100 కోట్ల వ‌సూళ్ల‌ని సాధించింది అంటే ప్రేక్ష‌కుల ఆలోచ‌న‌ల్లో ఎంత‌గా మార్పులొచ్చాయో అద్దం ప‌డుతుంది.

అందులో స్టార్ హీరో లేడు. కేవ‌లం కంటెంట్ మాత్ర‌మే జ‌నాల్ని థియేట‌ర్ కి ర‌ప్పించిన‌ సినిమా అదే. అలాగే సీతారామం...బింబిసార లాంటి చిత్రాలు సైతం అదే కోవ‌లో విజ‌యం సాధించాయి. వీళ్లెవ్వ‌రు పెద్ద‌గా పేరున్న వారు కాదు. కేవ‌లం క‌థా బ‌లంతో మాత్ర‌మే ఆడిన చిత్రాలు. తాజా సంకేతాలు... నిర్మాత‌ల్లో వ‌చ్చిన మార్పుల‌తో టాలీవుడ్ లో న‌వ‌శ‌కం మొద‌లైన‌ట్లే క‌నిపిస్తుంది.

ఇక‌పై కొత్త కుర్రాళ్ల‌కి ఇండస్ర్టీ రెడ్ కార్పెట్ వేసి మ‌రీ ఆహ్వానించ‌డానికి ఛాన్స్ ఉంది. కాంబినేష‌న్స్ కాదు. క‌థ ఎలా ఉంది? అన్న‌ది ఆలోచించుకోవాలి. క‌థ‌పై నిర్మాత మంచి ప‌ట్టు సాధించాలి అన్న కోణంలో ఇటీవ‌ల నిర్మాత‌ల భేటిలో తేల్చిన సంగ‌తి తెలిసిందే. హీరోల్ని న‌మ్ముకోవ‌డం క‌న్నా క‌థ‌ల్ని న‌మ్మి సినిమాలు చేసే రోజులొచ్చాయ‌ని ఆ ర‌కంగా సంకేతాలు అందించారు.

ఇప్పుడున్న యువ నిర్మాత‌ల్లో సైతం చాలా మార్పులొచ్చాయి. కొత్త వాళ్ల‌కి అవ‌కాశం క‌ల్పించడంలో ఏమాత్రం వెనుక‌డుగు వేయ‌లేదు. క‌థ న‌చ్చింది..డీల్ చేగ‌ల‌డు అన్న‌ భరోసా క‌ల్పిస్తే కోట్ల రూపాయలు ఖ‌ర్చు చేయ‌డానికి ముందుకొస్తున్నారు. వేరే విష‌యాల్ని ఇక్క‌డ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు.

భారీ లాభాలు రాక‌పోయినా పెట్టిన పెట్టుబ‌డికి నిర్మాత‌కు రూపాయి లాభం..టిక్కెట్ కొని చూసిన ప్రేక్ష‌కుడికి న్యాయం జ‌రిగితే చాలు అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. వీట‌న్నింటిని న‌వ‌త‌రం ప్ర‌తిభావంతుల్ని ప్రోత్స‌హించ‌డానికి సంకేతాలుగానే భావించాలి. ఇంత‌కాలం అవ‌కాశం రాక ఖాళీగా ఉన్న ప్ర‌తిభావంతుల‌కు ఇవ‌న్నీ శుభ సూచికాలే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.