Begin typing your search above and press return to search.

ఐఎండీబీ టాప్-50లో గూఢ‌చారి!

By:  Tupaki Desk   |   20 Aug 2018 5:25 PM GMT
ఐఎండీబీ టాప్-50లో గూఢ‌చారి!
X
టాలీవుడ్ లో గ‌త రెండేళ్లుగా విల‌క్ష‌ణ క‌థ‌ల‌తో వ‌చ్చిన సినిమాలను ప్రేక్ష‌కులు విప‌రీతంగా ఆద‌రించిన సంగ‌తి తెలిసిందే. అర్జున్ రెడ్డి - ఆర్ ఎక్స్ 100...గూఢ‌చారి....వంటి సినిమాలు చిన్న సినిమాలుగా విడుద‌లై పెద్ద విజ‌యాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా....మ‌న‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేని స్పై జాన‌ర్ లో వ‌చ్చిన గూఢచారి సినిమా ప్రేక్ష‌కులు - విమ‌ర్శ‌కులు - సెల‌బ్రిటీల ప్ర‌శంస‌లు కూడా అందుకుంది. ఓర‌కంగా టాలీవుడ్ - బాలీవుడ్ - కోలీవుడ్ ల‌లోని బెస్ట్ స్పై థ్రిల్లర్లలో గూఢ‌చారి ఒక‌టి. ఈ చిత్రాన్ని చూసిన ఆడియ‌న్స్ కూడా ఆన్ లైన్ టికెట్ ప్లాట్ ఫామ్స్ లో మంచి రేటింగ్ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో - గూఢ‌చారికి తాజాగా ఓ అరుదైన ఘ‌న‌త ద‌క్కింది. ప్రఖ్యాత మూవీ డేటా బేస్ సంస్థ ‘ఐఎండీబీ’ కూడా ‘గూఢచారి’కి విడుద‌లైన కొత్త‌లో 10కి 9 రేటింగ్ వచ్చింది. తాజాగా, ఐఎండీబీ టాప్-100 తెలుగు సినిమాల రేటింగ్స్ లో ‘గూఢచారి’ 38వ స్థానంలో నిలిచింది.

ఐఎండీబీలో టాప్-100 సినిమాల రేటింగ్స్ ప్రకారం ‘గూఢచారి’ 38వ‌స్థానంలో నిలిచి ఔరా అనిపించింది. ఓవ‌రాల్ గా ఆ సినిమాకు రేటింగ్ 7.7గా ఉంది.‘మాయాబజార్’ - `సాగర సంగమం` - `అహనా పెళ్లంట` - `నువ్వు నాకు నచ్చావ్` - `మహానటి` - `అర్జున్ రెడ్డి` - `బొమ్మరిల్లు` - `బాహుబలి: ది కంక్లూజన్` - `అతడు` - `ఆ నలుగురు` ఉన్నాయి. అయితే, అడివి శేష్ హీరోగా న‌టించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘క్షణం’ ఈ జాబితాలో 14వ స్థానంలో ఉండటం విశేషం. ఆ చిత్రం రేటింగ్ 7.9గా ఉంది. అడివి శేష్ లాంటి అప్ కమింగ్ హీరో సినిమాలు రెండు ఐఎండీబీ టాప్-50లో ఉండటం గ‌మ‌నార్హం. మ‌రి, గూఢ‌చారి సిరీస్ లో రాబోతున్న సినిమాలు ఏ ర్యాంక్ లో నిలుస్తాయో వేచి చూడాలి.