Begin typing your search above and press return to search.

అక్కడ హంగామా చేస్తున్న గూఢచారి!

By:  Tupaki Desk   |   6 Aug 2018 9:09 AM GMT
అక్కడ హంగామా చేస్తున్న గూఢచారి!
X
ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాల్లో 'గూఢచారి' బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మంచి టాక్ - పాజిటివ్ రివ్యూలు రావడంతో యూ.ఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా తన సత్తా చాటుతోంది. 'గూఢచారి' ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ 400K దాటడం విశేషం. ప్రస్తుతం ఉన్న ఊపులో ఈ సినిమా అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ టచ్ చేయడం సులువే.

అడివి శేష్ హీరోగా నటించడమే కాకుండా ఈ సినిమాకు కథ - స్క్రీన్ ప్లే అందించడం విశేషం. స్పై థ్రిల్లర్లు తెలుగు తెరకు కొత్త కానప్పటికీ - ఈ సినిమాలోని మోడరన్ ట్రీట్ మెంట్ ఈ జెనరేషన్ ఆడియన్స్ కు కనెక్ట్ అయింది. కొత్త దర్శకుడు అయినా శశికిరణ్ తిక్కా ఈ సినిమాను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కొత్తదనానికి ఎప్పుడూ స్వాగతం పలికే ఓవర్సీస్ ఆడియన్స్ కు మన దేశి స్పై థ్రిల్లర్ అందుకే వెంటనే కనెక్ట్ అయింది. పెద్ద రేంజ్ స్టార్స్ లేకపోయినా - స్టార్ డైరెక్టర్ లేకున్నా హాఫ్ మిలియన్ మార్కు దిశగా పయనించడం అంటే.. అందుకు ఫ్రెష్ కంటెంటే కారణం. ఈ సినిమాలో హీరోయిన్ గా శోభిత ధూళిపాళ నటించగా - సుప్రియ యార్లగడ్డ ఓ కీలక పాత్రలో మెరిసింది.

ఈ సినిమా అమెరికా కలెక్షన్స్ ఓ సారి చూద్దాం. గురువారం(ప్రీమియర్లు): $53k - శుక్రవారం: $105k - శనివారం $159k - ఆదివారం: $100k.

మరోవైపు సుశాంత్ చిత్రం 'చి ల సౌ' సినిమాకు రివ్యూస్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ అవి కలెక్షన్స్ రూపం లో మాత్రం పెద్దగా రిఫ్లెక్ట్ కావడం లేదు. ఫస్ట్ వీకెండ్ లో $100k కలెక్షన్స్ తో మాత్రం సరిపెట్టుకుంది. కానీ ఈ కలెక్షన్స్ సుశాంత్ కెరీర్ లో బెస్ట్ కావడం ఓ విశేషం.