Begin typing your search above and press return to search.

అక్క‌డి నుంచే 3కోట్లు లాగేశాడు

By:  Tupaki Desk   |   7 Aug 2018 4:18 AM GMT
అక్క‌డి నుంచే 3కోట్లు లాగేశాడు
X
సినిమా బావుంటే ఆకాశానికెత్తేయ‌డం క్రిటిక్స్‌కి అల‌వాటు. చెత్త సినిమాని చెత్త సినిమా అని డైరెక్టుగా ఎటాక్ చేయ‌డం కూడా ఫిలిం క్రిటిక్ విధానం. అయితే బావున్న సినిమాని బాలేద‌ని చెత్త రేటింగు లిచ్చారంటూ ఉడుక్కునే వాళ్లున్నారు. చెత్త సినిమా తీసి ఆ కోపాన్ని మీడియాపై ప్ర‌ద‌ర్శించే ప్ర‌బుద్ధులకు కొద‌వేం లేదు. అలాంటివాళ్లు ప్ర‌స్తుతం అడివి శేష్ `గూఢ‌చారి`కి మీడియా చేస్తున్న ప‌బ్లిసిటీ చూస్తుంటే ఇందులో జెన్యూనిటీని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

`గూఢ‌చారి` జెన్యూన్ హిట్ ఈ సీజ‌న్‌ లో. ఆర్‌.ఎక్స్ 100 త‌ర్వాత ఈ సినిమాకి జ‌నం నుంచి ద‌క్కుతున్న ఆద‌ర‌ణ‌ను ప‌రిశీలిస్తే ఆ సంగ‌తి ఇట్టే అర్థ‌మ‌వుతుంది. గూఢ‌చారిని థియేట‌ర్‌ లో చూసిన‌వారెవ‌రూ బాలేదు అన్న మాటే లేదు. మ‌రో ప‌దిమందికి ఈ సినిమా చూడమ‌ని చెబుతున్నారు. అంత పాజిటివ్ వైబ్రేష‌న్ సినిమాలో విష‌యం ఉంటేనే వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ సినిమాకి కేవ‌లం తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల్లో - క్రిటిక్స్‌ లోనే కాదు.. అటు బాలీవుడ్‌ లోనూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. గూఢచారి ఇంటా బ‌య‌టా క‌లెక్ష‌న్ల దుమ్ము దులుపుతోంది. రిలీజైన అన్నిచోట్లా చ‌క్క‌ని ఆద‌ర‌ణ పొందుతోందని ప్ర‌ముఖులు ట్వీట్ చేస్తున్నారు.

లేటెస్టుగా ప్ర‌ఖ్యాత క్రిటిక్‌ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ `గూఢ‌చారి`ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ సినిమా అమెరికా బాక్సాఫీస్ వ‌ద్ద సుమారు 3కోట్ల వ‌సూళ్లు సాధించిందంటూ ట్విట్ట‌ర్‌ లో వివ‌రాలందించారు. `గూఢ‌చారి` ఓవ‌రాల్‌ గా 6కోట్లు తెలుగు రాష్ట్రాల నుంచి - 3కోట్లు అమెరికా నుంచి వ‌సూలు చేసింది. అంటే 9కోట్ల మేర వ‌సూళ్లు తొలి వీకెండ్‌ లోనే ఆర్జించింది. ఇదివ‌ర‌కూ మ‌హేష్ ప్ర‌శంస‌లు ద‌క్కాయి. లేటెస్టుగా కింగ్ నాగార్జున మ‌స్ట్ వాచ్ అంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్‌ లో ఇంకా ఇంకా టాప్ సెల‌బ్రిటీలంతా ఈ సినిమాని చూసి ఎంక‌రేజ్ చేస్తున్నారు. అంటే ఇది కాదా మంచి కంటెంట్ తెచ్చిన విజ‌యం?