Begin typing your search above and press return to search.
'గూఢచారి' లాభం ఎన్ని రెట్లు?
By: Tupaki Desk | 6 Aug 2018 4:44 PM GMTఅడివి శేష్ మళ్లీ కొట్టాడు. ఇంకా చెప్పాలంటే ఈసారి ఇంకా బలంగా కొట్టాడు. ‘క్షణం’ కంటే కూడా ‘గూఢచారి’ పెద్ద హిట్టయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి తొలి వారాంతంలో ఓపెనింగ్స్ అంచనాల్ని మించి వచ్చాయి. రూ.6 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే దాదాపుగా పెట్టుబడిని వెనక్కి తెచ్చేసింది. ఇక వచ్చేదంతా లాభమే. ఇది ఈజీగా పెట్టుబడి మీద రెట్టింపు వసూళ్లు రాబట్టే అవకాశాలున్నాయి. థియేట్రికల్ వసూళ్ల సంగతలా ఉంచితే.. శాటిలైట్.. డిజిటల్ హక్కుల ద్వారా కూడా భారీగానే ఆదాయం అందే అవకాశముంది. ఈ సినిమాకు వచ్చిన టాక్.. బాక్సాఫీస్ రన్ ప్రకారం చూస్తే పెట్టుబడి ఎంతో అంత మొత్తం శాటిలైట్.. డిజిటల్ హక్కుల రూపంలోనే వస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ఇక ‘క్షణం’ లాగే దీనికి కూడా పొరుగు భాషల నుంచి రీమేక్ ఆఫర్లు వస్తే ఆ రూపంలోనూ భారీగానే ఆదాయం అందే అవకాశముంది. ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ లోనే శేష్ ఆల్రెడీ రీమేక్ ఆఫర్లు ఉన్నట్లుగా చెప్పడం విశేషం. సినిమా ఇప్పటికే టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయింది.. పైగా జాతీయ మీడియా సైతం ఈ సినిమా గురించి వార్తలు ఇస్తోంది కాబట్టి రీమేక్ కోసం ఇప్పటికే ఆరాలు మొదలై ఉన్నా ఆశ్చర్యం లేదు. తమిళ.. హిందీ భాషల్లో ‘గూఢచారి’ రీమేక్ అయ్యే అవకాశాలున్నాయి. బాలీవుడ్ లో ఎవరైనా పెద్ద హీరో దీన్ని రీమేక్ చేస్తే బాగానే వర్కవుటయ్యే అవకాశాలున్నాయి. మరి వేరే భాషల్లో ఎవరు ‘గూఢచారి’ అవుతారో చూడాలి. రీమేక్స్ కూడా వర్కవుటైతే.. మొత్తంగా పెట్టుబడి మీద నాలుగు రెట్లయినా ‘గూఢచారి’ ఆదాయం రాబడుతుందని భావించవచ్చు. ఇక శేష్ తర్వాతి సినిమా మీద ఏ స్థాయిలో అంచనాలుంటాయో.. అతడి మార్కెట్ రేంజ్ ఎక్కడికి వెళ్తుందో చెప్పేదేముంది?