Begin typing your search above and press return to search.
జూ.ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేసిన గూగుల్
By: Tupaki Desk | 23 July 2016 9:11 AM GMT జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా ముఖ్యమంత్రి అవుతారో లేదో తెలియదు కానీ గూగుల్ సంస్థ మాత్రం ఆయన్ను సీఎంను చేసేసింది. ఇటీవలే మోడీ విషయంలో పొరపాటు చేసి విమర్శలపాలైన గూగుల్ ఈసారి మరో తప్పు చేసింది. అయితే.. ఈసారి తప్పు సెర్చి ఇంజిన్లో దొర్లలేదు. ట్రాన్సులేషన్ విభాగంలో దొర్లింది. గూగుల్ ట్రాన్సులేషన్ ఓపెన్ చేసి ఇంగ్లీష్ నుంచి తెలుగుకు తర్జుమా ఆప్షన్ పెట్టి.. ఇంగ్లీష్ లో తారక్ అని టైప్ చేసి చూడండి.. తెలుగులో ముఖ్యమంత్రి అని కనిపిస్తుంది. తారక్ అన్న పదం.. ఎక్కువగా సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కే వాడుతారు. కాబట్టి గూగుల్ లెక్కల ప్రకారం జూనియర్ ముఖ్యమంత్రి అయిపోయినట్లే.
తెలుగు ప్రజల అభిమాన నటుడు - మాజీ ముఖ్యమంత్రి - టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనవడిగా ఆయన రూపురేఖలను కలిగి ఉన్న జూ.ఎన్టీఆర్ భవిష్యత్తులో పెద్ద ఎన్టీఆర్ లాగే ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే... తాత స్థాపించిన పార్టీ టీడీపీ ఆయన్ను దూరం పెడుతోంది. దీంతో ఒక దశలో రాజకీయాలకు చేరువైనా మళ్లీ ఇప్పుడు మాత్రం పూర్తిగా దూరంగా ఉంటున్నారు. భవిష్యత్తులో జూనియర్ ఎలాంటి అడుగులు వేస్తారో.. ఎటువైపు నడుస్తారో తెలియదు కానీ ఇప్పటికిప్పుడు మాత్రం గూగుల్ ఆయన్ను ముఖ్యమంత్రిని చేసి అభిమానులకు సందడి చేసింది.
అయితే గూగుల్ ట్రాన్స్ లేషన్ పై గతంలో కూడా విమర్శలు చెలరేగాయి. లీగల్ నోటీసులు కూడా జారీ అయిన సందర్భాలున్నాయి. ప్రాంతీయ భాషలపై పట్టులేకపోవడం వలనే.. పబ్లిక్ ఎడిటింగ్ కు అవకాశం ఇవ్వడం వల్ల ఇలాంటి తప్పు జరిగిందని అర్థమవుతోంది. ఒక్క 'తారక్' విషయంలోనే కాదు, అనేక పదాల అనువాదం విషయంలోనూ నెటిజన్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయంటూ భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. తాజా తప్పుపై గూగుల్ ఎలా స్పందిస్తుందో.. ఎప్పటికి రెక్టిఫై చేసుకుంటుందో చూడాలి.