Begin typing your search above and press return to search.
గూగుల్ సిఈఓనే మహర్షికి స్ఫూర్తి
By: Tupaki Desk | 10 May 2019 11:07 AM GMTనిన్న విడుదలైన మహర్షికి వచ్చిన డివైడ్ టాక్ గురించి కాసేపు పక్కన పెడితే హీరో పాత్రలోని వేరియేషన్స్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. సినిమా బిగినింగ్ లో మహర్షిని ఝాన్సీ పాత్ర చేసే ఇంటర్వ్యూలో ఏడాదికి 900 కోట్ల శాలరీ తీసుకునే మీరు ఎలా ఫీలవుతున్నారు అని ప్రశ్నిస్తే దానికి బదులుగా మహేష్ చెప్పే సమాధానం దగ్గర ఋషి స్వభావాన్ని బయటపెడతారు.
అయితే ఒక భారతీయుడికి విదేశీ కంపెనీలో అన్ని వందల కోట్ల జీతం ఇస్తారా అనే సందేహం సామాన్యుల్లో వ్యక్తమయ్యింది. నిజానికి ఈ పాత్రకు స్ఫూర్తి గూగుల్ సిఈఓ సుందర్ పిచ్ఛయ్ అని చెప్పొచ్చు. గూగుల్ లో సెర్చ్ చేసిన సమాచారం ప్రకారం ఆయన వార్షిక ఆదాయం ఏడాదికి 1200 కోట్లకు పైమాటే. అదే ఫిగర్ ను తీసుకుంటే ఆయన కథే అనుకుంటారని కాబోలు ఓ మూడు వందలు డిస్కౌంట్ ఇచ్చేశారు
సో మహర్షి పాత్రకు ఇచ్సిన రెమ్యునరేషన్ లో లాజిక్ అయితే ఉంది. కాకపోతే ఏకంగా కంపెనీలకె హీరో రివర్స్ ఆఫర్ ఇవ్వడం అక్కడా హీరోయిజం ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేయడం లాంటివి కొంచెం అతిశాయోక్తిగా అనిపించినా మాస్ హీరో కాబట్టి ఇలాంటివి తప్పవు అనుకోవాలి. అన్నట్టు హీరోకు స్వంత కంపెనీ ఉండి వేల కోట్ల ఆదాయం ఉన్నట్టు చూపించడం కామనే కాని ఇలా వేరే సంస్థలో ఉద్యోగం చేస్తూ ఇంతేసి పారితోషికాలు చూపడం మాత్రం వెరైటీనే. ప్రస్తుతం వీకెండ్ ని వాడుకునే పనిలో ఉన్న మహర్షికి అసలు పరీక్ష సోమవారం నుంచి మొదలు కానుంది.. ఇంతే దూకుడు అప్పుడూ కొనసాగితే మంచిదే