Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU : విన్నర్‌ ఎవరో చెప్తున్న గూగుల్‌

By:  Tupaki Desk   |   24 Sep 2021 9:30 AM GMT
#BIGGBOSS5TELUGU : విన్నర్‌ ఎవరో చెప్తున్న గూగుల్‌
X
తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 మూడు వారాలు ముగింపు దశకు చేరుకుంది. మూడవ వారంలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ విషయం పక్కన పెడితే గూగుల్‌ లో కొందరు బిగ్‌ బాస్ సీజన్ 5 విజేత ఎవరు అయ్యి ఉంటారు అంటూ ప్రశ్నించిన సమయంలో గూగుల్‌ సమాధానంగా శ్రీరామ చంద్ర పేరును ఇస్తోంది. కొన్ని సార్లు ప్రియాంక సింగ్ అనే పేరును కూడా గూగుల్ చూపిస్తుంది. గూగుల్‌ లో ఎక్కువ మంది శ్రీరామ చంద్ర మరియు ప్రియాంక సింగ్‌ ల గురించి సెర్చ్‌ చేయడంతో పాటు పలు వెబ్‌ సైట్స్ మరియు సోషల్‌ మీడియా ల్లో వీరిద్దరి గురించి ప్రముఖంగా చర్చించుకోవడం వల్ల గూగుల్‌ తప్పుడు సమాచారం ఇస్తున్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 విజేత విషయంలో కాంపిటీషన్ చాలా టఫ్‌ గానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒక కంటెస్టెంట్ విషయంలో స్పష్టత రాలేదు. ఒక రోజు ఒకరు మంచి అనుకుంటే ఆ తర్వాత రోజు వారు తప్పుగా కనిపిస్తున్నారు. ఇలా రకరకాలుగా పరిస్థితులు మారుతున్నాయి. క్రేజ్ పరంగా రవి.. శ్రీరామ చంద్రతో పాటు ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు. అయితే వారి ప్రవర్తన కారణంగా వారు ముందే వచ్చినా ఆశ్చర్యం లేదు. ఏమాత్రం క్రేజ్ లేకుండా లోనికి వెళ్లిన జెస్సీ లాంటి వారు విజేత అయ్యి వచ్చిన ఆశ్చర్యం లేదు. బిగ్‌ బాస్ విన్నర్‌ అనేది ఇప్పుడే నిర్ణయించేది కాదు. గత సీజన్‌ ల్లో అభిజిత్ మరియు కౌశల్‌ లను అన్నారు. వారి ప్రవర్తన మొదటి నుండి చివరి వరకు అలాగే కొనసాగింది కనుక అనుకున్నట్లుగా వారే విజేతలు అయ్యారు.

రాహుల్‌ సిప్లిగంజ్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆయన విజేత అవుతాడని ఎవరు అనుకోలేదు. కాని అతడు అభిమానుల నుండి అనూహ్యంగా ఆధరాభిమానాలను దక్కించుకుని సక్సెస్ అయ్యాడు. అందుకే అతడికి ట్రోఫీ దక్కింది. ఈసారి అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే అభిజిత్ లేదా కౌశల్ లా ముందే విజేతలుగా డిక్లెర్‌ అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. రాబోయే వారాల్లో అయినా వారి గురించి మరింతగా తెలిసి ఒక అవగాహణకు వస్తామేమో చూడాలి. జనాల్లో ఆ అవగాహణ రాకుండానే గూగుల్‌ మాత్రం శ్రీరామ చంద్ర లేదా ప్రియాంక సింగ్ అంటూ డిక్లైర్‌ చేయడం జరిగింది. సాంకేతిక తప్పిదం మరియు ఇతర విషయాల కారణంగా గూగుల్‌ అలా చూపిస్తూ ఉండవచ్చు. ఖచ్చితంగా విజేత విషయంలో ఇప్పట్లో ఒక నిర్ణయానికి రావడం కష్టమే. గూగుల్‌ చెప్పినట్లుగా శ్రీరామ చంద్ర కూడా అయ్యే అవకాశాలు లేక పోలేదు.