Begin typing your search above and press return to search.
కేజీఎఫ్-2: ఆ క్లైమాక్స్ కి కాపీ అంటే రొటీనే కదా!
By: Tupaki Desk | 5 April 2020 3:30 AM GMTకన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్-2పై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. కేజీఎఫ్ చాప్టర్ -1 పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో దేశం మొత్తం కేజీఎఫ్-2 కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తోంది. కేజీఎఫ్-1 శుభం కార్డు పడింది మొదలు.. కొనసాగింపు భాగం కాబట్టి ఆ తర్వాత పార్ట్ ని ఎలా మలుస్తున్నారు? అన్న ఒకటే ఉత్కంఠ అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ నెలకొంది. అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి.
తాజాగా సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. సినిమా క్లైమాక్స్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని చెబుతున్నారు. చివరి అరంగంట కేవలం యాక్షన్ ఎపిసోడే కనిపిస్తుందని..కోలార్ బంగారు గనుల్లో జరిగే ఆ సన్నివేశాలు కన్నడ సినీ ఇండస్ట్రీ హిస్టరీ లో చెప్పుకునేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే యశ్ రోల్ ఓ ట్రాజిక్ ముంగింపు అన్నదే ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతోంది. బంగారం మాఫియా.. క్రైమ్ వరల్డ్ ని సమూలంగా కూకుటి వేళ్లతో నాశనం చేసినన అనంతరం ఎండింగులో హీరో పాత్ర చనిపోతుంది. ఆ ముగింపు సైరా నరసింహారెడ్డి సినిమాలో ఉయ్యాల వాడ క్లైమాక్స్ ను గుర్తు చేస్తుందని అంటున్నారు.
సైరాలో బ్రిటీషర్లను అంతమొందించిన అనంతరం నరసింహారెడ్డి తలను మొండెం నుంచి వేరు చేసి బురుజుకు వేలాడదీయడం సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. ఉయ్యాల వాడ విరోచిత పోరాటం ముగిసిన అనంతరం ఒక్కసారిగా అలాంటి ఊహించని ట్రాజిక్ సీన్ ప్రేక్షకాభిమానులకు పెద్ద షాకిచ్చింది. ఎమోషన్ ని రగిలించింది. కేజీఎఫ్ క్లైమాక్స్ అంతే ఇదిగా ఉంటుందట. సరిగ్గా అలాంటి సీన్ కేజీఎఫ్ ముంగిపు లో కనిపించడం ఉత్కంఠ పెంచేదే అయినా అప్పటికే వచ్చేసిన దానిని కాపీ చేయడం అన్నది ఎంతవరకూ కలిసొస్తుంది? విమర్శలేమైనా వస్తాయా? అన్నది చూడాలి. యథాతథంగా అలాంటి సీన్ నే రీక్రియేట్ చేయకుండా సందర్భానుసారం వంద శాతం యాప్ట్ గా ఉంటే థియేటర్లో ప్రేక్షకుడు అంగీకరిస్తారేమో. అలాగే ఇందులో అధీరాగా సంజయ్ దత్ లాంటి స్టార్ నటిస్తున్నారు కాబట్టి ఆ పాత్రకు క్లైమక్స్ లో విరోచిత పోరాటం సరిగ్గా కుదరాలి. వార్ వన్ సైడ్ అయినా హిందీలో బెడిసి కొట్టేస్తుందన్న సూచనలు చేస్తున్నారు. ఇక కరోనా పాఠం ఇప్పటికే అన్ని పాన్ ఇండియా సినిమాలతో పాటు ఇండస్ట్రీలకు తప్పడం లేదన్న సంగతి తెలిసిందే.