Begin typing your search above and press return to search.

సలార్ పై ఆ మాటలు వింటే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్..!

By:  Tupaki Desk   |   24 Dec 2022 10:53 AM GMT
సలార్ పై ఆ మాటలు వింటే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్..!
X
బాహుబలి హీరో.. కె.జి.ఎఫ్ డైరెక్టర్ ఇద్దరు కలిసి సినిమా చూస్తే ఎలా ఉంటుంది. అది కూడా బడ్జెట్ ఎంత అన్నది లెక్క చేయకుండా పెట్టే గట్స్ ఉన్న హోంబలే బ్యానర్స్ ప్రొడక్షన్ అయితే ఆ లెక్క మరింత పెరుగుతుంది. అలాంటి కాంబినేషన్ లోనే వస్తున్న సినిమా సలార్. ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అంటే మీరు ఎన్ని భారీ అంచనాలతో వచ్చినా దాన్ని మించి ఉంటుందని అంటున్నారు. ఇక లేటెస్ట్ గా సినిమా నిర్మాత విజయ్ కిరగందూర్ ఇచ్చిన అప్డేట్ ఇంకాస్త హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా అనుకున్నట్టుగానే సూపర్ గా వస్తుందని.. సినిమా 80 శాతం షూటింగ్ పూర్తయిందని.. నెక్స్ట్ ఇయర్ అనుకున్న టైం కే రిలీజ్ చేస్తామని చెప్పారు.

అంతేనా ఈ సినిమా తమ నుంచి వచ్చిన అన్ని సినిమాల రికార్డులను తప్పకుండా బ్రేక్ చేస్తుందని ఆయనే అన్నారు. హోంబలే బ్యానర్ నుంచి వచ్చిన భారీ హిట్ మూవీ కె.జి.ఎఫ్ 2 సో ఆ సినిమాని కూడా మించే వసూళ్లను సలార్ రాబడుతుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు నిర్మాత విజయ్. నిర్మాత కామెంట్స్ విన్న రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారు. కె.జి.ఎఫ్ రేంజ్ లో ప్రభాస్ మేనరిజం అంటే బాబోయ్ బాక్సాఫీస్ బద్ధలవడం పక్కా అని ఫిక్స్ అవ్వొచ్చు.

సలార్ సినిమాని కూడా ప్రశాంత్ నీల్ తన మార్క్ మూవీ గా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. కె.జి.ఎఫ్ కోలార్ మైనింగ్ గురించి తీస్తే.. సలార్ సింగరేణి బ్యాక్ డ్రాప్ లో వస్తుందని అంటున్నారు. అసలైతే ఒక సినిమాగా తీద్దామనుకున్న సలార్ కూడా రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తారని టాక్. సలార్ సినిమాలో ప్రభాస్ మాస్ యాటిట్యూడ్ కి ఆడియన్స్ కి మెంటల్ ఎక్కించేస్తాడో చూడాలి.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ కె, మారుతి సినిమా కూడా చేస్తున్నాడు. మారుతి రాజా డీలక్స్ మూవీ మరికొద్ది రోజుల్లో పూర్తవుతుందని తెలుస్తుంది. ప్రాజెక్ట్ కె మాత్రం నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ దాకా షూటింగ్ 2024లో రిలీజ్ అంటున్నారు. మరి ఈ లోగ మిగిలిన సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.