Begin typing your search above and press return to search.
గోపాల.. ఐ.. చుక్కలు కనిపిస్తున్నాయ్
By: Tupaki Desk | 20 Jan 2015 1:30 PM GMTవిడుదలైన 9 రోజుల్లో 'గోపాల గోపాల' సినిమా 38 కోట్ల షుమారు షేర్ కలెక్ట్ చేస్తే, శంకర్ 'ఐ' సినిమా ఏకంగా 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఏకంగా 71 కోట్ల షేర్ రాబట్టింది. అయితే ఈ సినిమాలు కంటెంట్ పరంగా వీక్ అని ప్రూవ్ అయినా కూడా, ఎందుకింత గొప్ప నెంబర్లు తెచ్చుకున్నాయ్? అబ్బే చాలా చింపుల్. సంక్రాంతి సీజన్‌లో బాక్సాఫీస్ దగ్గర వేరే ఇతరత్రా సినిమాలు లేకుండా రిలీజ్ ప్లాన్ చేశారు కాబట్టి, కలెక్షన్లు కుమ్మేశాయ్. కాని అసలు మజా ఇప్పుడుంది.
ఇంకో 8 కోట్లు వస్తేనే గోపాలా గోపాలా సేఫ్, అలానే మరో 10 కోట్లు వసూలు చేస్తేనే ఐ డిస్ట్రిబ్యూటర్లు సేఫ్. కాని అనూహ్యంగా సోమవారం నుండి ఈ రెండు సినిమాల గ్రాఫ్ అమాంతం పడిపోయినట్లు తెలుస్తోంది. ఆదివారంతో అందరికీ సెలవలు పూర్తవ్వడం.. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోవడం.. అలాగే పెద్దలు ఆఫీసులకు బయలుదేరడంతో.. సోమవారం నుండి ధియేటర్స్ ఖాళీగా ఉన్నాయట. ఎవరైనా సెలవుల్లో మిస్సయినవారు సినిమాలు చూడటమే తప్ప, రిపీట్ ఆడియన్స్ మాత్రం లేరు. దానితో సోమవారం గోపాల గోపాల ఓ కోటి కూడా వసూలు చేయలేకపోయింది. ఇక ఐ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మరి ఈ రెండు సినిమాలూ డిస్ట్రిబ్యూటర్లను గట్టెక్కిస్తాయా? చూద్దాం.