Begin typing your search above and press return to search.
8 కోట్లు వస్తే గోపాలుడు సేఫ్
By: Tupaki Desk | 20 Jan 2015 9:31 AM GMTపండగ సీజన్ కావడంతో సినిమా స్లోగా ఉందని చెప్పినా కూడా ఆడియన్స్ మాత్రం అల్లల్లాడిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్రలో, వెంకటేష్ ఓ దేవుడు మీద నమ్మకంలేని నాస్తికుడు కమ్ కృష్ణ భక్తుడి పాత్రలో నటించిన సినిమా ''గోపాలా గోపాలా''. సినిమాలో మ్యాటర్ ఎలా ఉన్నా కూడా సంక్రాంతి సీజన్‌లో ధియేటర్స్ దగ్గర కలెక్షన్లతో కుమ్మేసింది ఈ సినిమా. దిమ్మతిరిగే వసూళ్ళను తీసుకొచ్చింది. పదండి ఓ లుక్కేద్దాం.
విడుదలైన 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని ధియేటర్స్‌లో షేర్ మొత్తంగా కలుపుకొని దాదాపు 38 కోట్లు వసూలు చేసిందీ సినిమా. గోపాల గోపాల అనుకున్నదానికంటే ఆ విధంగా ఎక్కువ సంపాదించినట్లే. అయితే సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 46 కోట్లకు అమ్మేశారు. సో, ఇంకో 8 కోట్లు షేర్ వసూళ్ళు వస్తే తప్పించి బయ్యర్లకు లాభాలు రావనమాట. అసలు ఆ ఎనిమిది వస్తేనే ముందు పెట్టిన పెట్టుబడి అయినా సేఫ్‌గా ఉంటుంది. మరి మొన్నటివరకు హాలీడే సీజన్ కాబట్టి కుమ్మేసింది అనుకుందాం.. కాని సోమవారం నుండి అసలు కష్టాలు మొదలయ్యాయ్. అటు పిల్లలు, ఇటు పెద్దలందరూ తిరిగి ఎవరి పనుల్లో వారి బిజీ అయిపోయారు. మరి ఈ 8 కోట్లు సేఫ్‌గా వచ్చేస్తాయా? చూడాల్సిందే.