Begin typing your search above and press return to search.
'మహేష్ బాబుని అలా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు'
By: Tupaki Desk | 12 Oct 2022 2:30 PM GMTసూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి ఇటీవల పరమపదించిన సంగతి తెలిసిందే. గత ఆదివారం పెద్ద కర్మ కార్యక్రమాలు నిర్వహించగా.. చిత్ర పరిశ్రమ నుండి అనేకమంది వ్యక్తిగతంగా హాజరై నివాళులు అర్పించారు.
ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా ఇందిరా దేవికి నివాళులర్పించారు. కృష్ణ - మహేష్ బాబు లను పరామర్శించి తన సానుభూతిని వ్యక్తపరిచారు. ఘట్టమనేని కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. యూట్యూబ్ లో ఓ వీడియో షేర్ చేశారు పరుచూరి.
గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఘట్టమనేని కుటుంబంతో ఎన్నో ఏళ్ల నుంచి మాకు మంచి అనుబంధం ఉంది. కృష్ణ గారు - మహేష్ బాబు - రమేశ్ బాబు - ఆదిశేష గిరిరావు లతో మన కుటుంబంలో కుటుంబం లాగానే ఇన్ని సంవత్సరాలు మెలుగుతున్నాను. నేను అమెరికా నుంచి వచ్చేలోగా ఇది జరిగిపోయింది.
మొన్న సంస్మరణ సభలో కృష్ణగారిని కలిసినప్పుడు బా గుండె తక్కుపోయింది. ఇన్ని సంవత్సరాల కాలంలో మహేష్ బాబు ని అలా ఎప్పుడూ చూడలేదు. ఇందిరమ్మ అంటే మా దృష్టిలో ఒక దేవత. మహాలక్ష్మి. ఆమె ఎక్కువగా మాట్లాడరు. ఎప్పుడూ మౌనంగానే ఉంటారు. అందర్నీ చిరునవ్వుతో పలకరిస్తుంటారు. ఆమె కాలం చేసిందని తెలిసి బాధపడ్డాను. అక్కడి నుంచి అందరితో ఫోన్ లో మాట్లాడాను.
కానీ నిన్న ఆ కార్యక్రమంలో కృష్ణ గారితో కూర్చున్నప్పుడు ఆయన మొహం చూస్తుంటే మాత్రం ఎంతో ఆవేదన కలిగింది. ఆయనలో ఉన్న గొప్పదనం ఏంటంటే.. సాహసానికి మారు పేరు ఆయన. కానీ ఎన్ని ఎదురైనా తట్టుకొని ఉండగలగడంలో మారు పేరని నిన్న అర్థమైంది. సాధారణంగా అలాంటి సందర్భాల్లో ఎంత తల్లడిల్లిపోతామో అందరికీ తెలుసు. కానీ ఆయన గుండె నిబ్బరంతో కూర్చున్నారు.
మాకు పరిచయమైన తర్వాత చిరునవ్వు లేకుండా మహేష్ బాబుని అంత దిగులుగా చూడటం ఇదే మొదటిసారి. అలా తనని చూస్తానని నేను అనుకోలేదు. కోపంతో కూడ మహేష్ పెదవులపై చిరునవ్వు ఉంటుంది. అలాంటిది తల్లి జ్ఞాపకాల్లో ఆ చిరునవ్వు కనిపించలేదు. అలా తనని చూస్తుంటే నాకు ఎక్కువ దిగులుగా అనిపించింది. ఇలాంటి సమయంలో కృష్ణ గారు - మహేష్ బాబు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతోన్న ఇందిరా దేవి(70) సెప్టెంబర్ 28న తుదిశ్వాస విడిచారు. తల్లి మరణం నుంచి ఇప్పుడిప్పుడే బయటకొస్తున్న మహేశ్ బాబు.. తాజాగా ఓ షూటింగ్ లో పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే వారం నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB27 మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.