Begin typing your search above and press return to search.

గోపీచంద్‌ లు ఇద్దరు కలిసి సినిమా...

By:  Tupaki Desk   |   22 Oct 2018 7:37 AM GMT
గోపీచంద్‌ లు ఇద్దరు కలిసి సినిమా...
X
యాక్షన్‌ హీరో గోపీచంద్‌ ఈమద్య కాలంలో నటించిన చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. చివరగా గోపీచంద్‌ ‘పంతం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతకు ముందు చిత్రాల ఫలితాలే ‘పంతం’ కు కూడా దక్కింది. ఈ నేపథ్యంలో కాస్త గ్యాప్‌ తీసుకున్న గోపీచంద్‌ తన తదుపరి చిత్రాన్ని శ్రీవాస్‌ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే శ్రీవాస్‌ తో ప్రాజెక్ట్‌ కంటే ముందు గోపీచంద్‌ తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తో తెరకెక్కించిన ‘విన్నర్‌’ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో దర్శకుడు గోపీచంద్‌ మలినేనికి మరో ఛాన్స్‌ రావడం కష్టం అయ్యింది. ‘విన్నర్‌’ విడుదలైన సమయంలోనే సాయి ధరమ్‌ తేజ్‌ తో మరో సినిమాకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించాడు. కాని సాయి ధరమ్‌ తేజ్‌ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల గోపీచంద్‌ మలినేనికి ఇప్పట్లో డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే గోపీచంద్‌ తో సినిమా చేయాలని దర్శకుడు నిర్ణయించుకున్నారు.

వీరిద్దరి మూవీని భగవాన్‌ - పుల్లరావు లు శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్‌ లు నిర్మించబోతున్నారు. ఈ ఇద్దరు గోపీచంద్‌ ల మూవీ అధికారిక ప్రకటన మరి కొన్ని రోజుల్లో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రస్తుతం జరుగుతుంది. వీరిద్దరికి కూడా ఈ చిత్రం చాలా కీలకం. అందుకే ఈ చిత్రంపై దర్శకుడు గోపీచంద్‌ మలినేని చాలా శ్రద్ద పెడుతున్నట్లుగా తెలుస్తోంది. గోపీచంద్‌ ను గతంలో ఎప్పుడు చూడని విధంగా ప్రేక్షకులకు చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.