Begin typing your search above and press return to search.
పొరుగు మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ మకాం
By: Tupaki Desk | 8 Nov 2019 1:30 AM GMTప్రతిభను వెతుక్కుంటూ వెళ్లి అవకాశాలు ఇస్తున్నారు మన ఫిలింమేకర్స్. భాషాభిమానం కళారంగానికి సూట్ కాదన్నది చాలామంది అభిప్రాయం. లోకల్ ట్యాలెంటుకే ఛాన్సులు ఇవ్వాలన్న రూల్ ఇక్కడ లేనేలేదు. మన స్టార్ హీరోలు.. దర్శకనిర్మాతలు పాన్ ఇండియా మైండ్ సెట్ తో ఉన్నారిప్పుడు. పాత పద్ధతులకు స్వస్థి చెప్పి కొత్తగా వెళుతున్నారు. అయితే సరిగ్గా ఇదే పాయింట్ ఓ మలయాళ సంగీత దర్శకుడికి బాగానే కలిసొచ్చినట్టుంది. ఇంకేం ఉంది.. ఏకంగా హైదరాబాద్ కి మకాం మార్చేస్తున్నాడు. తనను ఆదరించి అవకాశాలిస్తున్న టాలీవుడ్ రుణం తీర్చుకునేందుకు ఇక్కడికే కుటుంబ సమేతంగా షిఫ్ట్ అయిపోతున్నాడు. ఇంతకీ ఎవరాయన అంటే.. ఇంకెవరు ట్యాలెంటెడ్ గోపి సుందర్.
కెరీర్ ప్రారంభించిన చాలా తక్కువ సమయంలోనే సౌత్ లో ఫేమస్ అయిన గోపి సుందర్ ఒకే ఏడాదిలో 25 మలయాళ చిత్రాలకు పని చేసి రికార్డ్ బ్రేక్ చేశాడు. తెలుగులో బ్రహ్మోత్సవం.. ప్రేమమ్ వంటి చిత్రాలకు సంగీతం అందించాడు. ఆరంభమే ఇక్కడ చార్ట్ బస్టర్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అతడి సినీకెరీర్ కి ఎదురే లేదు. ఓవైపు మల్లూవుడ్ లో సంగీతం అందిస్తూనే ఇటు అక్కినేని కాంపౌండ్ చిత్రాలకు పని చేస్తున్నాడు. అడపా దడపా అగ్ర బ్యానర్ల సినిమాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నాడు.
2019 అతడికి టాలీవుడ్ లో బాగానే కలిసొస్తోంది. ఇప్పటికిప్పుడు మూడు క్రేజీ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. విజయ్ దేవరకొండ.. అఖిల్.. కళ్యాణ్ రామ్ ఏరికోరి అతడినే ఎంపిక చేసుకున్నారు. దేవరకొండ `వరల్డ్ ఫేమస్`.. అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ సినిమా.. అలాగే కళ్యాణ్ రామ్ - సతీష్ వేగేష్న `ఎంత మంచివాడవురా!` చిత్రానికి అతడు సంగీతం అందిస్తున్నాడు. వీటితో పాటు మరిన్ని కమిట్ మెంట్లు ఉన్నాయట. అందుకే ఇటూ అటూ తిరిగే కంటే తెలుగు సినిమాలకు పూర్తి న్యాయం చేయాలంటే ఇక్కడే ఉండి పని చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇక మలయాళ పరిశ్రమతో పోలిస్తే టాలీవుడ్ లో పే-ప్యాకేజీ పెద్దగానే ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడేమో!