Begin typing your search above and press return to search.
ఆరు పడితేనే బుల్లెట్ దిగుతుందట
By: Tupaki Desk | 13 Jun 2017 8:24 AM GMTఆరడగుల బుల్లెట్ రిలీజ్ సంక్షోభంలో పడిపోయిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ అవుతుందని అనుకుంటే.. ఆఖరి నిమిషంలో వాయిదా పడిపోయింది. ఇందుకు కారణం సినిమా ఫైనాన్షియర్లకు నిర్మాతకు చివర్లో డీల్ కుదరకపోవడమే.
ఈ చిత్రానికి మొదటగా ఫైనాన్స్ చేసిన చెన్నై బేస్డ్ ఫైనాన్షియర్లు.. తమకు రావాల్సిన 6 కోట్లు ఇస్తే మాత్రమే సినిమా విడుదలకు అనుమతిస్తామని తేల్చేశారట. నిజానికి ఈ మూవీ షూటింగ్ సుదీర్ఘ కాలం జరగడంతో.. అనుకున్నదానికంటే ఖర్చు తడిసిమోపెడైంది. గోపీచంద్ మార్కెట్ కంటే ఎక్కువగా ఖర్చు చేశారనే టాక్ ఉంది కూడా. అయితే.. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల కోసం.. గోపీచంద్ తో పాటు.. హీరోయిన్ నయనతార కూడా తన రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకుని సహకరించారట. అయితే.. ఇప్పటికిప్పుడు 6 కోట్లు తెచ్చి ఫైనాన్షియర్లకు చెల్లించేందుకు నిర్మాత సిద్ధంగా లేడని తెలుస్తోంది.
ముందు విడుదలకు సహకరిస్తే.. అప్పుడు చెల్లింపులు సిద్ధమే అని చెప్పినా వారు అంగీకరించకపోవడమే.. తాజా సంక్షోభానికి కారణంగా తెలుస్తోంది. మరి ఈ వివాదం పరిష్కరించి.. ఆరడుగుల బుల్లెట్ ను థియేటర్లలో దించేందుకు నిర్మాతల చివరి స్టెప్ ఏంటో తేలాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/