Begin typing your search above and press return to search.

‘ఆరడుగుల బుల్లెట్’కు కొత్త కష్టాలు..

By:  Tupaki Desk   |   7 Jun 2017 11:02 AM GMT
‘ఆరడుగుల బుల్లెట్’కు కొత్త కష్టాలు..
X
మూడేళ్లుగా మరుగున పడి ఉన్న తన సినిమా ‘ఆరడుగుల బుల్లెట్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తోందని సంతోషంగా ఉన్నాడు హీరో గోపీచంద్. కానీ ఆ సినిమా సజావుగా విడుదలవుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయిప్పుడు. విడుదలకు రెండు రోజులే ఉండగా.. అనుకోని వివాదం ఈ చిత్రాన్ని చుట్టుముట్టింది. ‘ఆరడుగుల బుల్లెట్’ కోసం నిర్మాతలు సి.కళ్యాణ్.. తాంత్ర రమేష్ తన దగ్గర రూ.6 కోట్ల అప్పు తీసుకున్నారని.. తర్వాత ఆ డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని .. కాబట్టి ఆ సినిమా విడుదలను ఆపేసి తనకు న్యాయం చేయాలని సహదేవ్ అనే ఎన్నారై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో ‘ఆరడుగుల బుల్లెట్’ శుక్రవారం యధావిధిగా విడుదలవుతుందా లేదా అన్నది సందేహంగా మారింది.

నాలుగేళ్ల కిందట ‘జగన్మోహన్ ఐపీఎస్’ పేరుతో సినిమా మొదలుపెట్టాడు గోపీచంద్. భూపతి పాండ్యన్ అనే తమిళ దర్శకుడితో మొదలైన ఈ సినిమాకు మధ్యలో బ్రేక్ పడింది. ఉన్నట్లుండి అతణ్ని తప్పించేశారు. తర్వాత బి.గోపాల్ చేతికి వచ్చిందీ సినిమా. మొదట ఈ చిత్రాన్ని ఆరంభించిన నిర్మాతలు భగవాన్.. పుల్లారావు కూడా తర్వాత ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. తాండ్ర రమేష్ దీన్ని తన చేతికి తీసుకున్నాడు. కళ్యాణ్ బ్యాకప్ ఇచ్చాడు. అయినా సినిమా అనుకున్న ప్రకారం ముందుకు కదల్లేదు. షూటింగ్ పూర్తయినా విడుదలకు నోచుకోలేదు. ఇంతలో పొట్లూరి వరప్రసాద్ జోక్యం చేసుకుని ఫైనాన్స్ ఇప్పించి సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే సినిమా టైటిల్ కూడా మారింది. ఐతే ఇప్పుడు సహదేవ్ అనే వ్యక్తి తాను ఈ సినిమాకు ఫైనాన్స్ ఇచ్చానంటున్నాడు. మరి ఈ వివాదాన్ని ఎలా సెటిల్ చేస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/