Begin typing your search above and press return to search.
అన్నీ తెలిసినా ఆ పని చేయను: గోపీచంద్
By: Tupaki Desk | 30 Jun 2022 5:29 AM GMTటాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సినీ నటుడు, సుప్రసిద్ధ దర్శకుడు టి. కృష్ణ తనయుడే గోపీచంద్. రష్యాలో ఇంజనీరింగ్ ను కంప్లీట్ చేసిన గోపీచంద్.. వ్యాపారవేత్తగా స్థిరపడాలని కోరుకున్నారు. కానీ, అనూహ్యంగా తండ్రి కృష్ణ క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు. దాంతో తండ్రి వారసత్వాన్ని కుటుంబంలో ఎవరో ఒకరు కొనసాగిస్తే బాగుంటుందని భావించి గోపీచంద్ సినీ రంగం వైపు అడుగులు వేశారు.
'తొలి వలపు' మూవీతో హీరోగా తెలుగు సినీ పరిశ్రలోకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్.. ఆ తర్వాత జయం, నిజం, వర్షం చిత్రాల్లో విలన్ గా నటించి నటుడిగా మంచి మార్కులు వేయించుకున్నాడు. ఆపై 'యజ్ఞం' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని హీరోగా నిలదొక్కుకున్న గోపీచంద్.. వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక్కో సినిమా చేస్తూ తనదైన టాలెంట్ తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు.
ఇకపోతే గోపీచంద్ ఇప్పుడు 'పక్కా కమర్షియల్' మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తే.. సత్యరాజ్, రావు రమేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలను పోషించారు. యూవి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్-2 బ్యానర్ల పై అల్లు అరవింద్, బన్నీ వాసు కలిసి నిర్మించిన ఈ చిత్రం జూలై 1న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్.. సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే దర్శకత్వంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోపీచంద్ తండ్రి టి.కృష్ణ గొప్ప దర్శకుడు. ఆయన చేసింది తక్కువ సినిమాలే అయినా.. అవి ఎప్పటికీ గుర్తిండిపోయే విధంగా తెరకెక్కించారు.
అయితే తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు గోపీచంద్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చినా.. దర్శకత్వం వైపు చూడలేదు. అందుకు కారణం ఏంటో.. తాజాగా గోపీచంద్ వివరించాడు. ఆయన మాట్లాడుతూ.. 'డైరక్షన్ కు సంబంధించి నాకు అన్ని విషయాలు తెలుసు. కానీ ఒక పూర్తి సినిమాను రూపొందించాలంటే దర్శకుడిగా ఎన్నో బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది.
దాని కోసం ఎంతో చేయాల్సి ఉంటుంది. నేను అంత ప్రిపేర్ అవ్వలేదు. పైగా డైరెక్షన్ అనేది ప్రాక్టికల్ గా నాకు రాదు. అందుకే ఆ పని చేయను. రాని విషయాన్ని అనవసరంగా కెలకడం ఎందుకు? ' అంటూ పేర్కొన్నారు. మొత్తానికి మెగా ఫోన్ పట్టే అవకాశాలు, ఆలోచనలు లేవని గోపీచంద్ స్పష్టం చేశారు.