Begin typing your search above and press return to search.
ఓటీటీ.. థియేటర్స్.. ఆ రెండింటి ఫ్యూచర్ చెప్పిన హీరోగోపీచంద్
By: Tupaki Desk | 8 Sep 2021 4:11 AM GMTహీరోగా ఎంట్రీ ఇచ్చి.. తర్వాత విలన్ గా మారి.. ఆ తర్వాత అందరూ ఆమోదించే హీరోగా మారిన విచిత్రం హీరో గోపీచంద్ సొంతం. తండ్రికి ఉన్న పేరు ప్రఖ్యాతులతో ఇండస్ట్రీకి పరిచయమైనా..కొద్దికాలానికే తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకొని.. సొంతకాళ్ల మీద నిలబడే స్టామినాను ప్రదర్శించే ఇతగాడు నటించిన సిటీమార్ మూవీ ఈ వారం విడుదల కానుంది. కబడ్డీ ఆట బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉంటుంది.
వినాయకచవితిని పురస్కరించుకొని థియేటర్లలో విడుదల కానున్న తన సినిమా నేపథ్యంలో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు గోపీచంద్. ఓటీటీల్లో సినిమాల్ని విడుదల చేయటం అనేది నిర్మాతలకు అనుగుణంగా ఉంటుందని.. సినిమా కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుంటే.. వారు మాత్రం ఏం చేస్తారంటూ ప్రశ్నించిన ఆయన.. ఓటీటీ ఒక అడ్వాంటేజ్ గా పేర్కొన్నారు. రానున్నరోజుల్లో ఓటీటీకి మరింత మంచి ఆదరణ ఉంటుందన్నారు. అయితే..థియేటర్స్ మాత్రం జీవితాంతం ఉంటుందని పేర్కొన్నారు.
సిటీమార్ చేయటానికి ముందు విద్యా వ్యవస్థ మీద ఒక మూవీ చేద్దామని సంపత్ చెప్పాడని.. ఇప్పుడప్పుడే మెసేజ్ ఓరియంటెడ్ మూవీలు వద్దని.. వేరే కథతో చేద్దామన్నప్పుడు సిటీమార్ కథను తీసుకొచ్చాడన్నారు. దీంతో.. అందుకు ఓకే చెప్పినట్లు చెప్పాడు.
సిటీమార్ మూవీలో నటించిన కబడ్డీ జట్టులోని 12 మందిలో నలుగురు నిజమైన కబడ్డీ ప్లేయర్స్ అని.. మిగిలిన ఎనిమిది మందికి మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చారని.. ప్రాక్టీస్ లో దెబ్బలు తగిలినా.. పట్టించుకోకుండా పని చేశారన్నారు. సినిమాను 2020 వేసవిలో విడుదలకు ప్లాన్ చేసినా..కరోనా కారణంగా ఇంత కాలానికి విడుదల చేయాల్సి వచ్చిందన్నారు.