Begin typing your search above and press return to search.
గోపీచంద్ వాళ్లను క్షమించేశాడా?
By: Tupaki Desk | 24 Oct 2017 10:32 AM GMTహీరో గోపీచంద్ కెరీర్ ఈ మధ్య ఇబ్బందికరంగా తయారైంది. అతను కమిటైన కొన్ని ప్రాజెక్టులు అతణ్ని బాగా ఇబ్బందికి గురి చేశాయి. అందులో ‘ఆరడుగుల బుల్లెట్’ ఒకటి.. ‘ఆక్సిజన్’ మరొకటి. నాలుగేళ్ల పాటు నిర్మాణంలో ఉన్న ‘ఆరడుగుల బుల్లెట్’ చివరికి విడుదలకు సిద్ధమై.. ఉన్నట్లుండి పక్కకు వెళ్లిపోయింది. ‘ఆక్సిజన్’ కూడా ఇలాగే వాయిదాల మీద వాయిదా పడింది. ఈ సినిమా స్క్రిప్టు, ఔట్ పుట్ విషయంలో దర్శకుడు జ్యోతికృష్ణ - అతడి తండ్రి.. నిర్మాత ఎ.ఎం.రత్నంతో గోపీకి విభేదాలు వచ్చాయని.. దీంతో ఒక దశలో గోపీ షూటింగుకి కూడా సహకరించలేదని వార్తలొచ్చాయి. దీంతో ‘ఆక్సిజన్’ మరింతగా ఆలస్యమైనట్లు కూడా గుసగుసలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో ‘ఆక్సిజన్’ ఆడియో వేడుకకు గోపీచంద్ వస్తాడా రాడా అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి. ఐతే సోమవారం రాత్రి జరిగిన ‘ఆక్సిజన్’ ఆడియో వేడుకకు వచ్చిన గోపీచంద్ మామూలుగానే కనిపించాడు. రత్నం.. జ్యోతికృష్ణలతో సన్నిహితంగానే మెలిగాడు. వాళ్ల గురించి మంచిగానే మాట్లాడాడు. రత్నం వల్లే తాను ‘ఆక్సిజన్’ సినిమా చేశానని గోపీచంద్ చెప్పాడు. జ్యోతికృష్ణ తనకు ‘ఆక్సిజన్’ కథ చెప్పినపుడు రత్నం నిర్మాత అయితేనే చేస్తానన్నానని.. అన్నట్లే ఆయన ఈ సినిమాను ఉన్నత నిర్మాణ విలువలతో నిర్మించాడని గోపీచంద్ చెప్పాడు. ‘ఆక్సిజన్’ చాలా కష్టపడి చేసిన సినిమా అని.. ఇది కచ్చితంగా మంచి ఫలితాన్నందుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు గోపీచంద్. ‘ఆక్సిజన్’ నవంబరు 10న విడుదలవుతుందని భావిస్తున్నారు.