Begin typing your search above and press return to search.
అందరినీ థియేటర్లకు లాక్కొచ్చే సత్తా 'సీటిమార్' కి ఉంది: గోపీచంద్
By: Tupaki Desk | 9 Sep 2021 6:40 AM GMTగోపీచంద్ హీరోగా చేసిన 'సీటీమార్' సినిమా, ఈ నెల 10వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా జరుపుకుంది. ఈ వేదికపై గోపీచంద్ మాట్లాడుతూ .. "ఈ సినిమాను మేం స్టార్ చేసి ఓ 50 శాతం చిత్రీకరణ జరిగిన తరువాత కరోనా మొదలైంది. దానితో 9 నెలల పాటు షూటింగును ఆపేసి అందరం ఇళ్లలోనే ఉండిపోయాము. ఆ తరువాత సినిమా షూటింగును పూర్తిచేసి రిలీజ్ కి వెళదామని అనుకుంటూ ఉండగా మరోసారి లాక్ డౌన్ వచ్చి పడింది.
ఆ సమయంలో నాకు నిర్మాతలను చూస్తే పాపం అనిపించింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అందరి జీవితాలపై ఆ ప్రభావం పడింది. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాము. జనమంతా బయటకు వస్తున్నారు .. అంతా బాగానే ఉంది. అందువలన పక్కా మాస్ సినిమాగా 'సీటీమార్' థియేటర్లకు వస్తోంది. మీ అందరినీ ఇంట్లో నుంచి లాక్కొచ్చి థియేటర్లలో కూర్చోబెట్టే సత్తా ఈ సినిమాలో ఉంది. ఈ సినిమాను ఆదరిస్తే ఇంకా రావడానికి అనేక సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.
ముందుగా నేను నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పుకోవాలి .. ఫస్టు డే వారు ఏదైతే చెప్పారో, చివరివరకూ వారు అదే మాటపై ఉన్నారు. ఖర్చు విషయంలో వాళ్లు ఎంతమాత్రం వెనుకాడలేదు. అన్ని విషయాలను దగ్గరే ఉండి చూసుకున్నారు. ఇక ఆ తరువాత సంపత్ నంది గురించి చెప్పుకోవాలి. గతంలో ఇద్దరం కలిసి 'గౌతమ్ నంద' చేశాము. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సారి అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటూ ఈ సినిమాను చేశాము. ఈ సినిమాతో మేము అనుకున్నది తప్పకుండా రీచ్ అవుతామనే నమ్మకం ఉంది.
ఇక ఈ సినిమాకి బ్యాక్ బోన్ సినిమాటోగ్రాఫర్ సౌందర రాజన్ అని చెప్పుకోవాలి. ఈ సినిమా ఇంత గ్రాండియర్ గా కనిపిస్తుందంటే అందుకు ప్రధానమైన కారణం ఆయనే. ఇక మణిశర్మ సంగీతం గురించి ప్ర్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయనతో కలిసి నేను ఏడెనిమిది సినిమాలు చేశాను. ఈ సినిమా సాంగ్స్ ఆల్రెడీ పెద్ద సక్సెస్ అయ్యాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన గురించి చెప్పుకోవలసిన అవసరం లేదు. మణిశర్మగారితో పాటుగా పాటలు రాసినవారికీ .. పాడినవారికి కూడా నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాను థియేటర్లలో చూడండి .. ఎలాంటి పరిస్థితుల్లోను డిజప్పాయింట్ చేయదు. అందరూ ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళతారు" అంటూ చెప్పుకొచ్చారు.