Begin typing your search above and press return to search.

ఫ్లోలో ఎలా ప‌డితే అలా మాట్లాడేస్తే ఎలా బాసూ!

By:  Tupaki Desk   |   10 July 2018 11:30 AM GMT
ఫ్లోలో ఎలా ప‌డితే అలా మాట్లాడేస్తే ఎలా బాసూ!
X
హిట్ టాక్ వ‌చ్చిన‌ప్పుడు ఆ ఆనంద‌మే వేరుగా ఉంటుంది. అలా అని.. ఆ ఆనందంలో ఏదో మాట్లాడితే మ‌రోలా ఉంటుంది. ఆ చిన్న విష‌యాన్ని గోపీచంద్ మ‌ర్చిపోయిన‌ట్లున్నారు. వ‌రుస ఎదురుదెబ్బ‌ల నేప‌థ్యంలో పంతంతో ఒక్క‌సారిగా మ‌ళ్లీ కొత్త శ‌క్తి రావ‌టంతో ఇప్పుడాయ‌న మ‌హా హుషారుగా ఉన్నారు.

పంతం స‌క్సెస్ పై థ్యాంక్స్ మీట్ లో గోపీచంద్ మాట‌ల్ని చూస్తే.. బాసు జోరు కాస్త త‌గ్గిస్తే మంచిద‌నిపించ‌క మాన‌దు. ఎందుకంటే.. పంతం హిట్.. త‌న గ‌త సినిమాల‌కు మించిపోయేలా ఉంద‌ని.. భారీ స‌క్సెస్ అయిన‌ట్లుగా చెప్పుకోవ‌టం అంతగా సూట్ కాలేదు.

ఇవాల్టి రోజున సినిమా స‌క్సెస్ ఎంత‌న్న విష‌యాన్ని ఓపెన్ గా అంద‌రూ మాట్లాడుకోవ‌టం.. అందుకు త‌గ్గ బ‌జ్ మీడియాలో కాకున్నా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వేళ‌.. స్టీరియో టైప్ మాట‌లతో ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదు. ఒక‌వేళ‌.. త‌మ‌ను తాము పొగుడుకున్నా.. వెంట‌నే అందుకు త‌గ్గ పంచ్ లు ప‌డ‌టం ఖాయం. అందుకే.. మాట్లాడే మాట ఆచితూచి అన్న‌ట్లు ఉండాలి.

పంతం ఫెయిల్ కాలేదు కానీ బ్లాక్ బ‌స్ట‌ర్ కాలేదు. ఓకే అన్న‌ట్లుగా ఉన్న ఈ మూవీ స‌క్సెస్ పై గోపీచంద్ య‌మా హుషారుగా ఉన్నాడు. త‌న మార్కెట్ త‌గ్గ‌లేద‌ని.. తన‌కు మంచి సినిమాలు ప‌డాలే కానీ త‌న స‌త్తా చూపించాల‌న్న క‌సితో ఉన్నాడు. పంతం స‌క్సెస్ కు అంద‌రూ కార‌ణం అంటూ క్రెడిట్ అంద‌రి ఖాతాలో వేసేసిన గోపీ.. కాస్తంత విన‌మ్ర‌త‌.. మ‌రికాస్త భావోద్వేగంతో చెప్పిన మాట‌లు అంద‌రిని ఆక‌ట్టుకుంటున్నాయి. పేరు పేరునా అన్న మాట‌కు త‌గ్గ‌ట్లు.. సినిమాకు ప‌ని చేసిన వారిలో ఎవ‌రిని  వ‌దిలిపెట్ట‌కుండా పొగిడేశాడు.