Begin typing your search above and press return to search.
ఇక దబిడి దిబిడే .. 'వేటపాలెం'లోకి బాలయ్య!
By: Tupaki Desk | 17 Dec 2021 2:30 AM GMTమొత్తానికి బాలకృష్ణ చాలా కాలం తరువాత తన స్థాయి హిట్ కొట్టాడు. 'అఖండ' సినిమాతో ఆయన పేరు అఖండ నామస్మరణగా మారిపోయింది. తమ హీరో బాడీ లాంగ్వేజ్ కి తగిన సినిమా ఇన్నాళ్లకి వచ్చిందని బాలయ్య అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు జనాలు థియేటర్లకు వస్తారా లేదా? అని అంతా సందేహంతో ఉండగా, ఈ సినిమా రెండు వారాలకి పైగా థియేటర్లను దడదడలాడిస్తుండటం విశేషం. ఆడియన్స్ లో ఉన్న ఈ ఉత్సాహంతో, మిగతా పెద్ద హీరోలు కూడా తమ సినిమాలతో థియేటర్లకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇక ప్రస్తుతం బాలయ్య ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయన, త్వరలో గోపీచంద్ మలినేని సినిమాతో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, జనవరి 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుంది. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారని అంటున్నారు. రాయలసీమ నేపథ్యంలో జరిగే ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్ గాను, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గాను కనిపించనున్నారని చెబుతున్నారు.
ఈ రెండు పాత్రలు బాలయ్యకు కొట్టినపిండే. ఫ్యాక్షన్ లీడర్ పాత్రల్లో ఆయన విజృంభించారు .. పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో రెచ్చిపోయారు. అలాంటి పాత్రల్లో చేసిన సినిమాలు ఆయనకి బాక్సాఫిస్ బొనాంజా అనే పేరు తెచ్చిపెట్టాయి. అలా తనకి మంచి పేరు తెచ్చిపెట్టిన రెండు పాత్రలలో ఆయన ఒకేసారి తెరపై కనిపించనున్నారన్న మాట. ఆయన సరసన నాయికలుగా శ్రుతి హాసన్ ను .. భావనను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇక నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుంది. ఆమె పాత్రను గోపీచంద్ మలినేని డిఫరెంట్ గా డిజైన్ చేశాడని చెబుతున్నారు.
ఈ సినిమాకి 'వేటపాలెం' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టు చెబుతున్నారు. గతంలో ఆ ప్రాంతంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'క్రాక్' సినిమాతో ఈ ఏడాది తిరుగులేని హిట్ ను అందుకున్న గోపీచంద్ మలినేని నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోను ఆసక్తి ఉంది. ఇక 'అఖండ' తరువాత బాలకృష్ణ చేస్తున్న సినిమా కావడం మరింతగా అంచనాలు పెంచడానికి కారణమవుతోంది. 'క్రాక్' సినిమాలో 'జయమ్మ' పాత్రలో అదరగొట్టేసిన వరలక్ష్మీ శరత్ కుమార్, ఈ సినిమాలో ఏ రేంజ్ లో తన జోరు చూపిస్తుందో చూడాలి.