Begin typing your search above and press return to search.
రవితేజ వదిలేశాడు.. గోపీచంద్ పట్టేశాడు
By: Tupaki Desk | 5 Feb 2017 8:00 PM GMTఒక దర్శకుడు ఒక కథను ఎవరి కోసమో రాస్తాడు. కానీ చివరికి అది ఇంకెవరి చేతికో వెళ్తుంది. ‘పటాస్’.. ‘సుప్రీమ్’ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి ‘రాజా ది గ్రేట్’ అనే స్క్రిప్టును రామ్ కోసం రాశాడు. కానీ అతడితో వర్కవుట్ కాలేదు. రవితేజ హీరోగా అదే కథతో సినిమా మొదలుపెట్టేస్తున్నాడు. మరోవైపు రవితేజ వదిలేసిన ఇంకో ప్రాజెక్టు మరో హీరో చేతికి వెళ్తోంది.
చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ దర్శకుడు కావాలని ఆశపడుతున్న చక్రి అనే కుర్రాడు.. రవితేజ హీరోగా ‘రాబిన్ హుడ్’ అనే సినిమా చేయాలని ఆశపడ్డాడు. రవితేజ కూడా అతడి అరంగేట్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే కనిపించాడు. ఐతే కొన్నాళ్ల ప్రయాణం తర్వాత మాస్ రాజా చక్రికి టాటా చెప్పేశాడు. ఐతే చక్రి ఆశలు వదులుకోకుండా యాక్షన్ హీరో గోపీచంద్ దగ్గరికి ఈ స్క్రిప్టు అతను ఓకే చెప్పినట్లు సమాచారం.
గోపీచందే ఈ చిత్రానికి నిర్మాతను సమకూర్చే పనిలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం గోపీ సంపత్ నంది దర్శకత్వంలో ‘గౌతమ్ నంద’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా పని పూర్తయ్యే లోపు ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లాలని భావిస్తున్నాడు గోపీ. మరోవైపు జ్యోతికృష్ణ దర్శకత్వంలో గోపీచంద్ చేసిన ‘ఆక్సిజన్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.