Begin typing your search above and press return to search.
సినిమా కోసం రా ఏజెంట్ నే కలిశాడు!
By: Tupaki Desk | 4 Oct 2019 5:30 PM GMTఓ కొత్త కథని ప్రేక్షకులకు చెప్పాలంటే దాని కోసం దర్శకుడు శ్రమించాలి. చెప్పబోయే అంశంపై పట్టు సాధించాలి. అందు కోసం రీసెర్చ్ చేయాలి. తమిళ దర్శకుడు తిరు కూడా తను గోపీచంద్ తో చేసిన స్పై థ్రిల్లర్ `చాణక్య` కోసం చాలానే రీసెర్చ్ చేశాడట. రా - సీఐఐ గురించి పరిశోధించి కథ రాసుకున్నాడట. రా ఏజెంట్స్ ఎలా పనిచేస్తారు? వాళ్ల విధి విధానాలు ఎలా వుంటాయి? ఇలాంటి విషయాలు తెలుసుకున్న తరువాత సబ్జెక్ట్ పై మరింత ఆసక్తిని పెంచుకున్నాడట. మరిన్ని విషయాల్ని లోతుగా అధ్యయనం చేయడం కోసం ఏకంగా ఓ రా ఏజెంట్ నే కలవాలని విశ్వప్రయత్నాలు చేసినట్టు తెలిసింది.
అయితే ఆ రా ఏజెంట్ తిరుని కలవడానికి ఇష్టపడలేదని - దాంతో తనని కలవలేకపోయాడట. అయితే నేం తనకు చాలా ఇష్టమైన `రా` ఆఫీసర్ రవీంద్ర కౌశిక్ స్ఫూర్తిగా తీసుకుని స్పైథ్రిల్లర్ `చాణక్య`ని తెరపైకి తీసుకొచ్చానని తిరు చెప్పుకొచ్చాడు. గోపీచంద్ నటించిన గత చిత్రాలకు మించి ఈ సినిమా కొత్తగా వుంటుందని - ఆయన కెరీర్ కి ఎంతో హెల్ప్ అవుతుందని తిరు హామీ ఇస్తున్నాడు. స్పై పుస్తకాలు చదివి తిరు స్క్రీన్ ప్లే రాసుకున్న `చాణక్య` సినిమాతో వరుస ఫ్లాపుల నుంచి గోపీచంద్ చాకచక్యంగా తప్పించుకుంటాడో లేదో తెలియాలంటే శనవారం మార్నంగ్ షో వరకు వేచి చూడాల్సిందే.