Begin typing your search above and press return to search.
గోపీచంద్ మూడు నిమిషాలు నాన్ స్టాప్ గా..
By: Tupaki Desk | 24 Feb 2017 5:13 AM GMTఓవైపు ‘సౌఖ్యం’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. మరోవైపు ‘ఆక్సిజన్’ సినిమా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. బి.గోపాల్ సినిమా సంగతీ ఎటూ తేలకుండా ఉంది. ఈ నేపథ్యంలో హీరో గోపీచంద్ ఆశలన్నీ సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న ‘గౌతమ్ నంద’ మీదే ఉన్నాయి. గత నెలలో రిలీజ్ చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ జనాల్ని బాగానే ఆకర్షించింది. స్టైలిష్ మేకోవర్ తో చాలా కొత్తగా కనిపించాడు గోపీచంద్. ఇప్పుడు మహా శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ మరో పోస్టర్ వదిలారు. అందులోనూ గోపీ నెవర్ బిఫోర్ అన్నట్లు కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబందించి మరో ఆసక్తికర అప్ డేట్ కూడా ఇచ్చారు.
‘గౌతమ్ నంద’ కోసం మూడు నిమిషాల నిడివి ఉన్న యాక్షన్ ఎపిసోడ్ బ్రేక్ లేకుండా సింగిల్ టేక్ లో పూర్తి చేశాడట గోపీచంద్. ఇందుకోసం నాలుగు రోజుల పాటు గోపీ.. యాక్షణ్ టీం రిహార్సల్స్ చేసిందట. తర్వాత 3 నిమిషాల నిడివి ఉన్న ఈ యాక్షన్ సీక్వెన్స్ ను బ్రేక్ అన్నదే లేకుండా పూర్తి చేశారట. ఇంత రిస్కీ ఫైట్ సింగిల్ టేక్ లో చేయడం నభూతో అనేస్తోంది ‘గౌతమ్ నంద’ టీమ్. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇందులో గోపీ సరసన హన్సిక కథానాయికగా నటిస్తోంది. గోపీకి మాత్రమే కాదు.. సంపత్.. నిర్మాతలు భగవాన్.. పుల్లారావులకు కూడా ఈ సినిమా హిట్టవడం చాలా కీలకం. పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్-2’ చేసే ఛాన్స్ మిస్సయ్యాక ‘బెంగాల్ టైగర్’ లాంటి బిలో యావరేజ్ మూవీ వచ్చింది సంపత్ నుంచి. మరోవైపు ‘రెబల్’ కొట్టిన దెబ్బకు తోడు.. గోపీతో చేసిన సినిమా విడుదలకు నోచుకోక ఆర్థికంగా చాలా దెబ్బ తిన్నారు భగవాన్-పుల్లారావు. మరి వీళ్లందరూ ‘గౌతమ్ నంద’ మీద పెట్టుకున్న ఆశలు ఏమేరకు నెరవేరుతాయో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/