Begin typing your search above and press return to search.
గౌతమ్ నంద టార్గెట్ చిన్నదే కాని
By: Tupaki Desk | 28 July 2017 5:08 AM GMTఈరోజు అందరూ యాక్షన్ హీరో గోపిచంద్ ను మరోసారి క్లాస్ లుక్కులో చూడబోతున్నారు. ఆల్రెడీ జిల్ సినిమాలో తన స్టయిలిష్ లుక్ ను బయటపెట్టిన మన హీరో.. ఇప్పుడు గౌతమ్ నంద సినిమాలో ఇంకా పోష్ గా కనిపిస్తున్నాడు. ఇక సినిమాను ఎలా తీసి ఎలా చూపించినా కూడా.. మొత్తంగా సినిమాను ఎంతకు అమ్మారు ఎంత వస్తుంది అనేదే చివరకు అందరూ చూసే లెక్క.
ఇప్పటివరకు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గట్టి బిజెనెస్సే చేసింది. నైజాంలో షుమారు 5.5 కోట్లు బిజినెస్.. సీడెడ్లో 3.5+ కోట్లు బిజినెస్ చేసిన ఈ సినిమా.. అన్నింటికంటే ఎక్కువగా ఆంధ్రలో ఏకంగా 8.9 కోట్ల బిజినెస్ చేసింది. ఇక భారతదేశంలోని మిగతా రీజియన్స్ అన్నీ కలపుకుంటే కూడా.. సినిమాకు మొత్తంగా 20 కోట్లు ప్రీరిలీజ్ బిజెనెస్ లో కేవలం ధియేట్రికల్ హక్కులను విక్రయించడం ద్వారా వచ్చేశాయి. ఈ మొత్తాన్ని షేర్ రూపంలో రికవర్ చేస్తేనే సినిమా లాభాల బాట పట్టేది.
డైరక్టర్ సంపత్ నంది గత సినిమా 'బెంగాళ్ టైగర్' మొత్తంగా లైఫ్ టైమ్ లో 21+ కోట్ల షేర్ వసూలు చేసింది. అలాగే గోపిచంద్ జిల్ మరియు సౌఖ్యం సినిమాలు బాగా తక్కువగా వసూలు చేశాయి. మరి ఇప్పుడు స్టయిలిష్ టీజర్లతో ఆకట్టుకున్న గౌతమ్ నంద టీమ్.. ఈ సినిమాతో ఇంప్రెస్ చేసి ఆ లక్ష్యాన్ని ఈజీగా చేధిస్తారా? ఏమో .. వేచి చూద్దాం.