Begin typing your search above and press return to search.
30 కోట్లు పెట్టారా.. పది కోట్లొచ్చాయ్
By: Tupaki Desk | 30 Aug 2017 6:57 AM GMTగోపీచంద్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమాగానే కాక.. అత్యధిక బిజినెస్ కూడా జరుపుకున్న చిత్రంగా ‘గౌతమ్ నంద’ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలోని కంటెంట్ కంటే కూడా ఇలాంటి ఫైనాన్షియల్ విషయాల గురించే విడుదలకు ముందు ఎక్కువ చర్చ నడిచింది. దీనికి రూ.30 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లుగా వచ్చిన వార్తలు ఆశ్చర్యానికి గురి చేశాయి. సినిమాకు హైప్ తీసుకురావడానికి కావాలనే ఇలాంటి వార్తలు పుట్టించారేమో అన్న చర్చ కూడా నడిచింది అప్పట్లో. ఎందుకంటే గోపీచంద్ సక్సెస్ లో లేడు. అతడి సినిమాలు రెండు విడుదలకే నోచుకోకుండా ఆగిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో అంత బిజినెస్ అన్నది నమ్మశక్యం కాని విషయం.
‘గౌతమ్ నంద’ బిజినెస్ విషయంలో వచ్చిన వార్తలు వాస్తవమే అనుకుందాం. ఇప్పుడు ఈ సినిమా ఫుల్ రన్ వసూళ్ల విషయానికి వద్దాం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం వరల్డ్ వైడ్ షేర్ రూ.10.3 కోట్లు మాత్రమే. అంటే బయ్యర్ల పెట్టుబడిలో మూడో వంతు మాత్రమే వసూలు చేసిందన్నమాట ఈ చిత్రం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.9.5 కోట్ల దాకా వసూలు చేసిన ఈ చిత్రం మిగతా ఏరియాలన్నింట్లో కలిపి రూ.80 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో అయితే రూ.19 లక్షలే వచ్చాయి. వాస్తవంగా ఈ సినిమాకు ఎంత బిజినెస్ జరిగిందో ఏమో కానీ.. బయ్యర్లకు భారీ నష్టాలైతే తప్పలేదన్నది వాస్తవం. ఆల్రెడీ ‘రెబల్’ సినిమాతో దారుణంగా దెబ్బ తిన్న బాలాజీ మీడియా అధినేతలకు ఇది కూడా పెద్ద పంచే అన్నమాట.