Begin typing your search above and press return to search.
గోపికి యాక్షన్ కలిసొచ్చేనా
By: Tupaki Desk | 9 Jun 2018 1:30 AM GMTహీరోగా కెరీర్ మొదలుపెట్టి విలన్ గా బ్రేక్ తెచ్చుకుని మళ్ళి హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్న గోపీచంద్ సినిమాలంటే ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఆసక్తి. అది గతం. గత మూడునాలుగేళ్ళుగా బాబు పరిస్థితి అసలు బాలేదు. పట్టిందల్లా బంగారం సామెతకు రివర్స్ లో చేసిందంతా సర్వమంగళం తరహాలో అన్ని డిజాస్టర్లు గానే మిగిలాయి. గోపిచంద్ అన్ని వర్గాలను మెప్పించే ఫామిలీ ప్లస్ మాస్ ఎంటర్ టైనర్లో బాగా మెప్పించగలడు. అలా కాదని సీరియస్ జానర్ ట్రై చేసిన ప్రతిసారి గోపి ఎదురు దెబ్బలు తినడమే జరిగింది. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో ఎవరు టచ్ చేయని బ్లడ్ మాఫియా మీద ఒక్కడున్నాడు చేస్తే ప్రేక్షకులు కన్విన్స్ కాలేక తిరస్కరించారు. అదే దర్శకుడితో అడ్వెంచర్ థీమ్ తో సాహసం చేస్తే దాన్ని హిట్ చేసే ధైర్యం అభిమానులు కూడా చేయలేకపోయారు. పూరి జగన్నాధ్ తో పోలీస్ నేపథ్యంలో గోలీమార్ ట్రై చేస్తే ఫలితం రిపీట్ అవ్వడం తప్ప మారలేదు. పూర్తి ఫామిలీ డ్రామా అని కృష్ణవంశీతో మొగుడు చేస్తే అది కూడా బాక్స్ వెనక్కు వచ్చిన సినిమానే. తన రీసెంట్ మూవీ గౌతమ్ నందా-ఆక్సిజన్ గురించి చెప్పాల్సిన పని లేదు.
విఖ్యాత దర్శకుడు బి గోపాల్ అంతటివాడు దర్శకుడిగా ఆరడుగుల బుల్లెట్ అనే సినిమా తీస్తే ట్రైలర్ విడుదల వరకు వచ్చి ఆగిపోయింది. అసలు విడుదల చేస్తారా లేదా అనేది గోపికు కూడా తెలియదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గోపీచంద్ మరో సారి యాక్షన్ మూవీ తో రిస్క్ చేస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ చక్రవర్తితో చేస్తున్న పంతం కూడా ఇదే జానర్ లో ఉన్నట్టు టీజర్ ద్వారా అర్థమయ్యింది. సోషల్ మెసేజ్ మిక్స్ చేసారు కానీ ఫక్తు కమర్షియల్ యాక్షన్ సినిమాగానే కనిపిస్తోంది. అసలే కలిసి రాని జానర్ లో గోపి మరో సినిమా చేయటం అంటే రిస్క్ చేస్తున్నట్టే. కథ డిమాండ్ మేరకో కాదో తెలియదు కానీ లుక్ విషయంలో కూడా గోపీచంద్ కొంత డల్ గా కనిపిస్తున్నాడు. తన 25వ సినిమా కాబట్టి గోపీచంద్ దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఫాన్స్ కూడా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. హిట్ కొట్టాలని పంతం పట్టిన గోపికి పంతం అయినా హిట్ ఇస్తుందో లేదో వచ్చే నెల తేలనుంది. దీని తర్వాతే కొత్త సినిమా ఒప్పుకునే ఆలోచనలో ఉన్నాడు గోపీచంద్.