Begin typing your search above and press return to search.
అరవింద్ గారి బ్యానర్లో చేయడానికి ఇంతకాలం పట్టింది!
By: Tupaki Desk | 4 Jun 2022 1:30 AM GMTగోపీచంద్ కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన మారుతి దర్శకత్వంలో ' పక్కా కమర్షియల్' సినిమా చేశాడు. గీతా ఆర్ట్స్ 2 - యూవీ వంశీ నిర్మించిన ఈ సినిమా జూలై 1వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రెస్ రిలీజ్ ఈవెంట్ లో గోపీచంద్ మాట్లాడుతూ .. "నేను ఈ సినిమా చేయడానికి కారణం .. యూవీ వంశీ. 'జిల్' సినిమా తరువాత సరైన స్టోరీ దొరక్కపోవడం వలన వెయిట్ చేస్తూ వచ్చాము.
ఒక రోజున వంశీ కాల్ చేసి మారుతి ఒక కథ చెబుతాడు .. విని ఎలా ఉందో చెప్పండి అన్నాడు. మారుతి ఫస్టాఫ్
చెప్పగానే సెకండాఫ్ కూడా చెప్పేయమని అన్నాను. కథ అంతా విన్న తరువాత చాలా బాగుందని అన్నాను. మొహమాటానికి నేను అలా అన్నానేమో అనుకుని మళ్లీ వంశీగారు నన్ను అడిగారు .. కథ ఎలా ఉందండీ అని. నిజంగానే చాలా బాగుందండీ .. తప్పకుండా చేద్దాం అన్నాను. అలా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. అంతకుముందు మారుతితో నాకున్న పరిచయం కూడా తక్కువ.
అయితే షూటింగ్ స్పాట్ కి వెళ్లిన తరువాత నాకు చాలా సన్నిహితుడితోనే కలిసి వర్క్ చేస్తున్నట్టుగా అనిపించింది. మా ఇద్దరి మధ్య మంచి వేవ్ లెంగ్త్ సెట్టైపోయింది. 'రణం' .. ' లౌక్యం' మాదిరిగా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి మంచి స్కోప్ ఉందనిపించింది. మారుతి కామెడీ చాలా బాగా రాశాడు. సెట్లో ప్రతి సీన్ ను ఎంజాయ్ చేస్తూ చేశాము. ఆయన ఏదైతే రాసుకున్నాడో అది నేను డెలివర్ చేశానని అనుకుంటున్నాను. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారని అడిగితే రాశి ఖన్నా అని చెప్పారు.
రాశి ఖన్నా చాలా టాలెంటెడ్ .. కాకపోతే తనకి ఇంతవరకూ సరైన పాత్రలు పడలేదు. ఈ సినిమాలో తను చాలా బాగా చేసింది. అరవింద్ గారికి ఇండస్ట్రీలో ఉన్న అనుభవం గురించి అందరికీ తెలిసిందే. ఆయన కనిపించినప్పుడల్లా టిప్స్ అడుగుతూ ఉండేవాడిని. 'మీ రూట్లో మీరు ముందుకు వెళ్లండి' అనేవారు. ఆయన బ్యానర్లో చేయడానికి నాకు ఇన్నేళ్లు పట్టింది. బన్నీవాసు గురించి నేను విన్నాను. తన చేతిలో పడిన కథను ఆయన ఏ స్థాయికి తీసుకుని వెళతాడనేది తెలుసు. అందువలన ఈ సినిమా సగం సక్సెస్ అయినట్టే అనుకున్నాను.
బన్నీ వాసు మీద ఎంత నమ్మకమైతే ఉందో ... మారుతిపై కూడా అంతే నమ్మకం ఉంది. ఆయన కూడా తన శక్తిమేరా కష్టపడ్డాడు. ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాను. టైటిల్ కి తగినట్టుగా ఇది పక్కా కమర్షియల్ సినిమా. జూలై 1వ తేదీన ఈ సినిమా విడుదలవుతుంది. లవ్ .. కామెడీ .. యాక్షన్ ను మీరు బాగా ఎంజాయ్ చేస్తారు" అంటూ చెప్పుకొచ్చాడు.