Begin typing your search above and press return to search.
ఈ మాటలు చెప్పే బాలయ్యను బుట్టలో వేసుకున్నావా గోపీ?
By: Tupaki Desk | 14 Nov 2021 5:09 AM GMTనందమూరి బాలకృష్ణ ను ఇండస్ట్రీ వర్గాల వారు.. ఆయన సన్నిహితులు మరియు అభిమానులు బోళా అంటూ ఉంటారు. ఆయన చిన్నపిల్లాడి మనస్థత్వం కలిగిన వ్యక్తి అని.. ఎవరు ఏం చెప్పినా కూడా నమ్ముతూ ఉంటాడని అంటారు. అలా ఎంతో మంది దర్శకులతో వర్క్ చేసి బాలయ్య చేతులు కాల్చుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. బాలయ్య మీతో ఒక్క సినిమా చేయాలనేది నా జీవిత లక్ష్యం.. మీరు ఒక్క అవకాశం ఇవ్వండి.. మీకు నేను పెద్ద అభిమానిని.. మీతో పని చేసే భాగ్యం అదృష్టం కావాలంటూ ఏ దర్శకుడు అడిగినా కూడా బాలయ్య కమిట్ అవ్వడం జరుగుతుంది. కథ ఇతర విషయాల గురించి ఆ తర్వాత.. మొదట అయితే సినిమా చేసేందుకు ఓకే చెప్పేస్తాడు. అలా బాలయ్య చేసిన కొన్ని సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోగా కొన్ని నిరాశ పర్చిన విషయం తెల్సిందే. అయినా కూడా బాలయ్య తన మనస్థత్వంను మార్చుకోడు. ఆయన ఇప్పటికి కూడా భోళా అనడంలో సందేహం లేదు. ఆయన మాటలు పైకి కఠువుగా అనిపించినా ఆయన చాలా స్పీట్ అంటూ అభిమానులు అంటూ ఉంటారు.
తాజాగా బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా ప్రారంభం అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా లో బాలయ్య మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇక సినిమా ప్రారంభం సందర్బంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి బాలయ్య సినిమాలు చూడటం కోసం చొక్కాలు చించుకుని మరీ థియేటర్ల వద్ద యుద్దాలు చేసేవాళ్లం. ఆ సమయంలో ఒక్కసారి అయినా నా అభిమాన హీరోను కలవాలని కలలు కన్నాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాలయ్య బాబును డైరెక్ట్ చేయాలని ఆశ పడ్డాను. అదే టార్గెట్ గా పెట్టుకుని ఇన్నాళ్లు వర్క్ చేశాను. బాలయ్య కోసం మంచి పవర్ ఫుల్ కథను రెడీ చేసుకుని ఆయన్ను కలవడం జరిగింది. నా కల నెరవేరింది.. ఆయనతో సినిమాను చేసే అవకాశం వచ్చింది. నా అభిమాన హీరో బాలయ్య ను డైరెక్ట్ చేసే అవకాశం రావడం లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఇది నాకు లైఫ్ టైమ్ రెస్పాన్సిబిలిటీగా భావించి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాను.. జై బాలయ్య అన్నాడు.
గోపీచంద్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన బాలయ్యతో సినిమా కోసం ఎంత ఎగ్జైట్ గా ఉన్నాడో అర్థం అవుతోంది. ఇలాంటి అభిమానులు తమ అభిమాన హీరోతో సినిమా తీస్తే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుందని గతంలో నిరూపితం అయ్యింది. ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను మీడియా వర్గాల వారు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్యతో సినిమా చేయాలంటే నేను మీ వీరాభిమానిని.. మీతో సినిమా చేయడం నా జీవిత లక్ష్యం అని చెప్తే పనైపోతుంది. ఇప్పుడు మీడియా ముందు చెప్పినట్లుగానే బాలయ్యతో కూడా చెప్పాడేమో అందుకే గోపీచంద్ మలినేనికి ఈ అవకాశః వచ్చింది. మొత్తానికి ఒక మంచి కలయిక లో రాబోతున్న ఈ సినిమా ఒక మాస్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ అవ్వాలని అభిమానులతో పాటు అందరు కోరుకుంటున్నారు.