Begin typing your search above and press return to search.
గోపీచంద్ తనపై వస్తున్న ట్రోలింగ్ పై క్లారిటీ
By: Tupaki Desk | 19 Jan 2023 8:08 AM GMTమాస్ మహారాజా రవితేజ తో గోపీచంద్ మలినేని తెరకెక్కించిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'క్రాక్'. ఈ మూవీతో శృతిహాసన్ టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 'కాటమ రాయుడు' తరువాత తెలుగు సినిమాల్లో కనిపించకుండా పోయిన శృతిహాసన్ 'క్రాక్' బ్లాక్ బస్టర్ తో మళ్లీ టాలీవుడ్ లోకి అడుగు పెట్టడం.. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ వరుస హిట్ లని తన ఖాతాలో వేసుకుంటోంది. రీసెంట్ గా సంక్రాంతికి ఇద్దరు అగ్రహీరోలతో కలిసి ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
ఇందులో గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన మూవీ కూడా వుంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఫ్యాక్షన్ యాక్షన్ డ్రామా 'వీర సింహారెడ్డి'. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. జనవరి 12న విడుదలైన ఈ మూవీ సంక్రాంతి రేసులో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లని రాబట్టి బాలయ్య సినిమాల్లో సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది.
ఇదిలా వుంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శృతిహాసన్ కు దర్శకుడు గోపీచంద్ మలినేని స్టేజ్ పైనే అందరూ చూస్తుండగా ఐ లవ్ యూ అని చెప్పాడు. ఆ తరువాత మాట్లాడిన శృతిహాసన్ ఇండస్ట్రీలో తనకు ఓ అన్నయ్య ఉన్నాడంటూ గోపీచంద్ గురించి చెప్పుకొచ్చింది.
ఆ తరువాత ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందంటూ నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడుతూ దర్శకుడు గోపీచంద్ తనపై వస్తున్న ట్రోలింగ్ పై క్లారిటీ ఇచ్చేశారు.
శృతిహాసన్ కు స్టేజ్ పైనే ఐలవ్ యూ చెప్పడం.. ఆ తరువాత దానిపై ట్రోలింగ్ మొదలు కావడంపై గోపీచంద్ ని ప్రశ్నిస్తే ఆసక్తికర సమాధానం చెప్పారు. శృతిహాసన్ తో ఇది నా మూడవ సినిమా. బలుపు, క్రాక్ ఇప్పుడు 'వీర సింహారెడ్డి' చిత్రాలు చేశాను. తను నా ఫ్యామిలీ మెంబర్ లాంటిది. తను నాకు చాలా ఇష్టమైన హీరోయిన్. మా మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ వుంది. తను నా వైఫ్ తోనూ బాగా క్లోజ్ గా వుంటుంది. నా కొడుకు సాత్విక్ అంటే తనకు చాలా ఇష్టం.
ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తన కోసం చాక్లెట్స్ తీసుకొస్తూ వుంటుంది. అలా మా మధ్య మంచి అనుబంధం వుంది కాబట్టే తను స్టేజ్ పై తనని అన్నయ్య అంటూ సంబోధించిందని, అలా మాట్లాడింది కాబట్టే నేను తనకు ఐ లవ్ యూ చెప్పానని దాన్ని తీసుకుని సోషల్ మీడియాలో అమ్మాయి, అబ్బాయి మధ్య లవ్ అన్నట్టుగా ట్రోల్ చేశారని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఆ వార్తులు చూసి నవ్వుకున్నానని వెల్లడించాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.