Begin typing your search above and press return to search.

మూడు గంట‌లు ర‌క్తం కారుతూనే..!

By:  Tupaki Desk   |   29 Sep 2019 3:19 PM GMT
మూడు గంట‌లు ర‌క్తం కారుతూనే..!
X
ఏదో నిమిషం రెండు నిమిషాలు కాదు.. ఏకంగా మూడు గంట‌ల పాటు అలా ర‌క్త‌స్రావం అవుతూనే ఉన్నా దానికి చికిత్స చేసేందుకు ఏదీ అందుబాటులో లేక చాలా దూరంలో ఉన్న‌ న‌గ‌రానికి అలా ఆ బాధ‌ను భ‌రిస్తూనే ప్ర‌యాణించాల్సి వచ్చింద‌ట‌. అస‌లు ఈ అనుభ‌వం త‌లుచుకుంటేనే టెర్రిబుల్ అనిపిస్తోంది క‌దూ? ఇలాంటి అనుభ‌వం ఎవ‌రికి ఎదురైంది అంటే... ఎగ్రెస్సివ్ హీరో గోపిచంద్ కి ఎదురైంద‌ట‌.

అప్ప‌ట్లో చాణ‌క్య‌ షూటింగ్ లో జ‌రిగిన యాక్సిడెంట్ వ‌ల్ల ఏకంగా నెల రోజులు పైగానే గోపిచంద్ విశ్రాంతి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. గాయం చాలా తీవ్ర‌మైన‌ది. నెర్వ్స్ క‌ట్ అయ్యి ర‌క్తం బోలెడంత కారిపోయింద‌ట. దానికి చికిత్స చేయ‌డం కూడా ఆల‌స్య‌మైపోయింది. దాని వ‌ల్ల చాలా ర‌క్తాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని గోపి చెబుతుంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. స‌రిగ్గా జైపూర్ న‌గ‌రానికి దాదాపు 3గం.ల ప్ర‌యాణ దూరంలో ఆ లొకేష‌న్ ఉంద‌ట‌. గాయం అయ్యాక‌ ఆ ప‌రిస‌రాల్లో ఆస్ప‌త్రి అన్న‌దే అందుబాటులో లేక‌పోవ‌డం త‌న‌కు పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ని తెలిపారు.

ఇంత‌కీ యాక్సిడెంట్ ఎలా అయ్యింది? అంటే.. అప్ప‌టికే రిస్కీగా ఉండే ఫైట్ సీక్వెన్సును అంతా చిత్రీక‌రించేశారు. చివ‌రిగా బైక్ ఛేజ్ సీన్ తీస్తున్నారు. అయితే ఆ బైక్ కండిష‌న్ స‌రిగా లేక‌పోవ‌డంతో యాక్సిడెంట్ అయ్యింది. త‌న ముందు ఉన్న కెమెరాల్ని సేవ్ చేయాల‌ని చూసి తాను గాయ‌ప‌డ్డాన‌ని తెలిపారు గోపీ. ఓ వెబ్ పోర్ట‌ల్ ఇంట‌ర్వ్యూలో ఈ సంగ‌తుల్ని వెల్ల‌డించారు. చిరు సైరా రిలీజైన మూడు రోజుల‌కు చాణ‌క్య రిలీజ‌వుతోంది. ద‌స‌రా సెలవులు అయితేనే ఇంత భారీ బ‌డ్జెట్ చిత్రానికి రిక‌వ‌రీ సాధ్య‌మ‌ని భావించి పోటీకెళ్లాల్సి వ‌చ్చింద‌ని గోపి చెప్ప‌డం విశేషం.